PM Modi Odisha| ఒడిశా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బిజేపీ) ప్రభుత్వం అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారంతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన బిజేపీ ప్రభుత్వ పనితీరుని ప్రధాని మోడీ సమీక్షించడానికి మూడు రోజుల యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో భాగంగా బిజేపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ.. రాజధాని భుబనేశ్వర్ లో శుక్రవారం నవంబర్ 29, 2024న ప్రసంగం చేశారు.
బిజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డుకుంటూ, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిపక్ష పార్టీలు నలిపివేస్తున్నాయి. ఈ ప్రతిపక్ష పార్టీలది ఒకటే లక్ష్యం తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఎలాగైనా మోసం చేసి అధికారం చేజిక్కించుకోవడం. అధికారం తమ జన్మహక్కు అని భావించేవాళ్లు గత దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్నారు. వారంతా అధికారం కోసం ఆత్రుతతో దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసున్నారు.
Also Read: జో బైడెన్ మతిమరుపుపై రాహుల్ గాంధీ కామెంట్లు.. తమకే సంబంధం లేదని చెప్పిన కేంద్రం
ప్రజాస్వామ్య వ్యవస్థలో సిద్ధాంతాల పరంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అందుకోసం నిరసనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది సాధారణం. కానీ ఇటీవల జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇదంతా ప్రతిపక్ష పార్టీలు తప్పు ప్రచారం చేయడం వల్లే జరుగుతోంది. ఈ తప్పుడు ప్రచారాలు దేశానికి చాలా ప్రమాదకరం. బిజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మోసపూరిత ప్రచారాలు తిప్పికొట్టేందుకు దేశభక్తులు కృషి చేయాలి. ఒడిశాలో బిజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయం. అధికారంలో లేనప్పుడు కూడా ఒడిశా అభివృద్దికి బిజేపీ కట్టుబడి ఉంది. హర్యాణా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో బిజేపీకి ప్రజలు అనూహ్య విజయం కట్టబెట్టారు. ప్రజల ప్రోత్సాహంతో బిజేపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా దేశాభివృద్ది కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాను.
బిజేపీ కృషి వల్లే ఒడిశాకు చెందిన ఒక ఆదివాసీ నాయకురాలు ద్రౌపది ముర్ము ఈ రోజు భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. ఆమె జీవిత ప్రయాణం భావితరాలకు ఆదర్శప్రాయం.” అని అన్నారు.
అంతకుముందు ఒడిశాలో జరిగిన ఆలిండియా డిజిపి, ఐజిపి సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ఒడిశా ఖ్యాతి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగేలా బిజేపీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. ఒడిశాలో బిజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం, మహిళ శక్తీకరణ కోసం చేపట్టిన సుభద్ర యోజన సంక్షేమ పథకం మంచి ఫలితాలనిస్తాయన్నారు. రైతులను నుంచి ధాన్యం కొనుగోలుకు క్వింటాల్‌కు రూ.3100 ధర చెల్లిస్తున్న ఒడిశా ప్రభుత్వానికి మెచ్చుకోవాల్సిందేనని పొగిడారు.
మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ ఇటీవల గత ప్రభుత్వం అమల చేసిన 21 సంక్షేమ పథకాల పేర్లు మారుస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో రూ.1.36 లక్షల కోట్ల పారిశ్రామిక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదించారు. స్టీల్, కెమికల్, టెక్స్‌టైల్, గ్రీన్ ఎనర్జీ రంగాలలో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 74,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.