Low Blood Pressure: అధిక రక్తపోటు ఈ రోజుల్లో చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. ఇది మన జీవనశైలి ,ఆహారపు అలవాట్లకు నేరుగా ప్రభావితం అవుతుంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే.. ఇది గుండె జబ్బులు,స్ట్రోక్ , మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. మంచి విషయం ఏమిటంటే.. ప్రతిరోజూ కొన్ని పండ్ల రసాలను తాగడం ద్వారా రక్తపోటును సహజంగా నియంత్రించవచ్చు. ఈ విషయంలో మీకు సహాయపడే 5 జ్యూస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బీట్‌రూట్ రసం:
బీట్‌రూట్ జ్యూస్ లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రక్త నాళాలను సడలించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యస్ తాగడం వల్ల సిస్టోలిక్ బీపీ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బీట్ రూట్ జ్యూస్ లో ఉండే ఫోషకాలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఫలితంగా అనేక లాభాలు కలుగుతాయి.
2.ఆరెంజ్ జ్యూస్:
నారింజ రసంలో విటమిన్ సి, పొటాషియం యొక్క గొప్ప మూలం. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చక్కెర లేని లేదా తాజాగా తయారుచేసిన రసాన్ని మాత్రమే తాగాలని గుర్తుంచుకోండి. ఆరెంజ్ జ్యూస్ లోని పోషకాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
3. కివీ జ్యూస్:
కివీ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు ,పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కివీ తినడం లేదా జ్యూస్ రోజూ తాగడం వల్ల రక్తపోటు మెరుగుపడుతుందని తేలింది. హైబీపీ సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా కివీ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
4.దానిమ్మ రసం:
దానిమ్మ రసంలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ధమనుల వాపును కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Also Read: ఆముదం ఇలా వాడితే.. చర్మం, జుట్టు సమస్యలు అస్సలు రావు !
5.అరటిపండు, బెర్రీ స్మూతీ:
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. బ్లూబెర్రీస్ లేదా స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలలో రక్తపోటును నియంత్రించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:
మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన జ్యూస్‌లలో అధిక మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి రక్తపోటును మరింత పెంచుతాయి.
ఎల్లప్పుడూ తాజా,ఇంట్లో తయారుచేసిన జ్యూస్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి.
జ్యూస్ మాత్రమే సరిపోదు: క్రమం తప్పకుండా వ్యాయామం, తక్కువ ఉప్పు ఉన్న ఆహారం, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు తగినంత నిద్రపోయినప్పుడు మాత్రమే హైబీపీ తగ్గుతుంది.