BigTV English

High BP foods: హైబీపీ ఉందా? పొరపాటున కూడా ఈ ఆహారాన్ని తినొద్దు.. గుండె ఆగుద్ది!

High BP foods: హైబీపీ ఉందా? పొరపాటున కూడా ఈ ఆహారాన్ని తినొద్దు.. గుండె ఆగుద్ది!

ఎక్కువమంది జనాభా ఇప్పుడు హైబీపీ, డయాబెటిస్‌తో బాధపడుతున్నారు వాటిని ఎదుర్కొనేందుకు ప్రతిరోజూ మందులను వాడుతున్నారు. ఎంతగా ఔషధాలను వాడుతున్నప్పటికీ వారిలో ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా నేటి కాలంలో చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి హై బీపీతో బాధపడుతున్న వారు గుండెపోటు బారిన పడకుండా ఉండాలన్నా లేదా బ్రెయిన్ స్ట్రోక్ గురికాకుండా ఉండాలన్నా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మీరు కూడా హై బీపీ తో బాధపడుతూ ఉంటే ఇక్కడ చెప్పిన ఆహారాలు ఏవీ తినకండి. లేకుంటే భవిష్యత్తులో గుండె సమస్యలు, బ్రెయిన్ సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.


పని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారాలు, బిజీ జీవితంలో ఆరోగ్యం ఎంతగానో చెడిపోతుం.ది అందుకే చిన్న వయసులోనే అధిక రక్తపోటు, డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక రక్తపోటు సమస్య ఎక్కువమందిలో వస్తోంది. అధిక రక్తపోటు ఉన్నవారు మంచి జీవనశైలిని పాటించడం ద్వారా తమ ఆయిష్షును పెంచుకోవచ్చు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు
అధిక రక్తపోటు ఉన్నవారు ప్రాసెస్ చేసిన ఎలాంటి ఆహారాలకైనా దూరంగా ఉండాలి. అంటే మార్కెట్లో లభించే చిప్స్, స్నాక్స్, ప్యాకెట్లలో అమ్మే ఆహారాలు…ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాలే. వాటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. సోడియం వల్ల అవి ప్యాకెట్లలో ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి. ఇలాంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల రక్తపోటు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కూల్ డ్రింకులను తాగే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనర్జీ డ్రింక్స్ కూడా హైబీపీ ఉన్నవారు తాగకూడదు. ఇవన్నీ కూడా మీ బీపీలో మార్పును తెస్తాయి. అధికంగా బ్లడ్ ప్రెషర్ పెరిగేలా చేస్తాయి.


వీలైనంతవరకూ ఉప్పును చాలా తక్కువగా వేసుకొని తినాల్సిన అవసరం ఉంది. రుచి కోసం ఉప్పును వేసుకుంటే అది మీ ఆయుష్షును తగ్గించేస్తుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు ఎప్పుడూ కూడా ఉప్పును అధికంగా తినకూడదు. అధిక రక్తపోటు ఉన్నవారికి ఉప్పు చాలా ప్రమాదకారి. ఎందుకంటే ఉప్పులో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. సోడియం రక్తపోటును వేగంగా పెంచుతుంది.

తీపి పదార్థాలు
చాలామంది డయాబెటిస్ లేకుండా హైబీపీతో బాధపడుతూ ఉంటారు. వారు తాము స్వీట్లు ఎక్కువగా తినవచ్చని ఎలాంటి సమస్యగా ఉండదని భావిస్తారు. నిజానికి హైబీపీకి, డయాబెటిస్ కు దగ్గర సంబంధం ఉంది. హై బీపీ బారిన పడినవారు కూడా స్వీట్లు చాలా తగ్గించాలి. తీపి పదార్థాలు చక్కెర స్థాయిలని త్వరగా పెంచుతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఈ గుండెపై ఒత్తిడి అధికమవుతుంది. గుండెపై ఒత్తిడి అధికంగా పడినా కూడా హైబీపీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది.

టీ, కాఫీలను ప్రతిరోజూ రెండు మూడు సార్లు తాగేవారు… వాటిని తగ్గించుకుంటే మంచిది. టీ, కాఫీలలో అధిక మొత్తంలో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ కూడా రక్తపోటును పెంచుతుంది. కాబట్టి రెండు కప్పుల టీ తాగే అలవాటు ఉన్నవారు ఒక కప్పు టీ తోనే సరిపెట్టుకోవాలి. అలాగే ఒకసారి టీ మరొకసారి కాఫీ అలా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కెఫీన్ ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

మరి ఏం తినాలి?
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలే అధికంగా తినాలి. తగినంత మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉన్న ఆహారాలను తినడం వల్ల హైబీపీ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బొప్పాయి, అరటి పండ్లు, పుచ్చకాయ, నారింజ వంటివి తినాలి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించడానికి ముందుంటాయి. అలాగే ఆకుపచ్చని కూరగాయలైన పాలకూర, బ్రకోలీ, వంటివి కూడా తినాలి. అలాగే క్యారెట్‌లు, బీన్స్ వంటివి తినడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.

హై బీపీతో బాధపడుతున్న వారు ఓట్స్, బ్రౌన్ రైస్, నట్స్, బఠానీలు, కాయిధాన్యాలు వంటివి తినాల్సిన అవసరం ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

అధిక రక్తపోటు ఉన్న రోగులు తమ ఆహారంలో వాల్‌నట్స్, బాదం, అవిసె గింజలు వంటివి చేర్చుకోవాలి. వీటిలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Also Read: మీకు తెలుసా? నోటిలోని బ్యాక్టీరియాతో ఆ వ్యాధిని ముందే పసిగట్టేయొచ్చట !

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×