Tips For White Hair: ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం చాలా సాధారణంగా మారింది. ఈ సమస్యను చిన్నా పెద్దా అన్ని వయసుల వారు ఎదుర్కొంటున్నారు. దీనికి ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం, రసాయన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం వంటివి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ సరైన టిప్స్ పాటిస్తే.. జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు. జుట్టు తెల్లబడటానికి గల కారణాలు, మీ జుట్టును నల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధిత వార్తలు
జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణాలు:
1. జన్యుపరమైన సమస్య:
మన జన్యువులకు జుట్టు తెల్లబడటానికి లోతైన సంబంధం ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరికైనా త్వరగా తెల్ల జుట్టు వస్తే మీకు కూడా త్వరగా జుట్టు రంగు మారే అవకాశం ఉంది. దీనిని పూర్తిగా నియంత్రించలేకపోయినా, సరైన జాగ్రత్తతో ఖచ్చితంగా తగ్గించవచ్చు.
2. పోషకాహార లోపం:
మన శరీరానికి సరైన పోషకాహారం అందకపోతే అది జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ బి12, ఐరన్ , ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల జుట్టు రంగును కాపాడే కణాలు బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు త్వరగా రంగు మారుతుంది.
3. ఒత్తిడి, ఆందోళన:
ఒత్తిడి, ఆందోళన మీ మానసిక స్థితిపై మాత్రమే కాకుండా మీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒత్తిడి జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది.
4. ధూమపానం, మాదక ద్రవ్యాలు:
ధూమపానం అలవాట్లు జుట్టుకు చాలా హానికరం. ఇవి శరీరంలో విష పదార్థాలను పెంచుతాయి. ఇవి జుట్టును బలహీనపరుస్తాయి. అంతే కాకుండా దీనివల్ల జుట్టు త్వరగా రంగు మారుతుంది.
5. రసాయన ఉత్పత్తుల వాడకం:
మార్కెట్లో లభించే జుట్టు రంగులు, షాంపూలు,ఇతర జుట్టు ఉత్పత్తులలో జుట్టు యొక్క సహజ మెరుపు, రంగును నాశనం చేసే రసాయనాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే, జుట్టు త్వరగా తెల్లబడుతుంది.
జుట్టు తెల్లబడకుండా చేసే 3 పదార్థాలు:
1. ఉసిరి (ఇండియన్ గూస్బెర్రీ):
ఉసిరి జుట్టుకు చాలా మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా ఇది జుట్టు రంగును కాపాడుకోవడానికి , తెల్ల జుట్టును నివారించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో ఉసిరి పొడిని కలిపి, కొద్దిగా వేడి చేసి వారానికి రెండుసార్లు ఈ నూనెతో మసాజ్ చేయండి. దీంతో పాటు ప్రతిరోజూ ఉసిరి రసం తాగడం వల్ల జుట్టు లోపలి నుండి పోషణ లభిస్తుంది.
2. కరివేపాకు:
కరివేపాకులో బీటా కెరోటిన్ , ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో కాస్త కరివేపాకులు వేసి చల్లారిన తర్వాత జుట్టు మూలాలకు రాయండి. ఇది జుట్టును బలోపేతం చేయడమే కాకుండా దాని మెరుపును కూడా పెంచుతుంది.
Also Read: ఇలా చేస్తే.. బట్టతల జన్మలో రాదు
3. ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తుంది. ఉల్లిపాయ రసం తీసి వారానికి ఒకటి లేదా రెండుసార్లు తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత జుట్టు కడుక్కోవాలి. ఈ రెమెడీ జుట్టును మందంగా, నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.