BigTV English

Wheat Flour : గోధుమపిండికి బదులుగా ఇది ఉపయోగించవచ్చు !

Wheat Flour : గోధుమపిండికి బదులుగా ఇది ఉపయోగించవచ్చు !
Wheat Flour

Wheat Flour : ఎన్నో వేల సంవత్సరాల క్రితమే గోధుమపిండిని ఆహార పదార్థాలలో ముఖ్యమైనదానిగా చేర్చారు. చపాతీ, పరోఠాలాంటివి చాలామంది డైట్‌లో రొటీన్‌గా మారిపోయింది. కానీ గోధుమల్లో ఉండే గ్లూటెన్ కొందరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గ్లూటెన్ ప్రొటీన్స్ వల్ల కొందరికి కడుపునొప్పి, నాసియా లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారికోసమే గోధుమపిండి స్థానంలో మరో పిండి పదార్థాన్ని పరిశోధకులు కనుగొన్నారు.


ఇప్పటికే గ్లూటెన్ పడనివారికోసం మార్కెట్లో ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మరికొన్ని డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి. ఎన్నో రకాల ధాన్యాలు కూడా గ్లూటెన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నాయి. తాజాగా స్వీట్ పొటాటో కూడా గోధుపిండికి ఆల్టర్నేటివ్‌గా ఉపయోగపడుతుందని పరిశోధకులు తేల్చారు. స్వీట్ పొటాటో నుండి వచ్చే పిండిలో న్యూట్రియంట్స్, యాంటి ఆక్సిడెంట్స్‌తో పాటు గోధుమపిండిలాగా కలర్ కూడా ఉంటుందని వారు తెలిపారు.

స్వీట్ పొటాటోను ఇప్పటికే చాలా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నారు. కానీ దాని నుండే వచ్చే పిండి ఇంకా మార్కెట్లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. స్వీట్ పొటాటో పిండిపై అన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాతే దీనిని మార్కెట్లో రిలీజ్ చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికే స్వీట్ పొటాటో పిండి తయారీపై ఎన్నో పరిశోధనలు జరిగినా.. అసలు దానిని ఎలా మిల్ చేస్తే.. ఆహార పదార్థాలకు సూట్ అయ్యే విధంగా పిండి వస్తుందని ఇప్పటివరకు తేల్చలేకపోయారు. తాజా పరిశోధనల్లో అది సాధ్యమయ్యింది.


ఈ పిండి తయారీ కోసం ముందుగా స్వీట్ పొటాటోను 122 లేదా 176 ఫారెన్‌హీట్‌లో ఎండబెట్టారు. ఆ తర్వాత దానిని పిండిలాగా చేశారు. పరిశోధకులు తయారు చేసిన ఈ పిండిని, మార్కెట్లో దొరుకుతున్న స్వీట్ పొటాటో పిండితో పోల్చిచూశారు. ఇలాంటి పిండి.. బ్రెడ్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుందని, అంతే కాకుండా అలా తయారు చేసిన బ్రెడ్ చాలా రుచికరంగా ఉంటుందని వారు అన్నారు. ఇలా వారు చేసిన పరిశోధనలు స్వీట్ పొటాటో పిండిని చాలామందికి దగ్గర చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×