BigTV English

Wheat Grass juice: గోధుమ గడ్డి సంజీవని అని మీకు తెలుసా..?

Wheat Grass juice: గోధుమ గడ్డి సంజీవని అని మీకు తెలుసా..?

Wheat Grass juice: మనకు అనేక రకాల జ్యూస్‌లు తెలుసు కానీ గోధుమ గడ్డి జ్యూస్‌ కూడా ఉందని తెలియదు. దీనిలో పోషకాలు అన్నింటికన్న ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ గోధుమ రసం పిండి జ్యూస్ రూపంలో తాగుతారు. దీనిలో పుష్కలమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఒక సూపర్ ఫుడ్. ఇందులో అనేర రకాల విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం వంటి మినరల్స్, ఇంకా అనేక రకాల అమినో యాసిడ్‌లతో నిండి ఉంటుంది.


గడ్డి జ్యూస్‌తో ఆరోగ్యం

గోధుమ గడ్డి రసం తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది, ఇది రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ కోల్లజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తూ యవ్వనంగా ఉండటానికి దోహదపడుతుంది. మొహం పై మొటిమలు రాకుండా పోరాడుతుంది.అలాగే ఈ జ్యూస్‌లో ఉన్న పోషకాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని మెరుగుపరుస్తూ ఆహారంలోని పోషకాలను శరీరానికి అందించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారంగా సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. గోధుమ గడ్డిలో ఉండే ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.


షుగర్‌కు చెక్

గోధుమ గడ్డి జ్యూస్ యెుక్క అతి ముఖ్యమైన ప్రయోజనాలలో రక్తంలో షుగర్‌ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ రసం రక్తంలో విష పదార్థాలను తొలగించి రక్త శుద్ధికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ జ్యూస్ ఉపయోగకరంగా ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌‌ను పూర్తిగా కరిగిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను ఈ జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చు.

క్యాన్సర్‌ను నివారిస్తుంది

గోధుమ గడ్డి రసం క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేస్తుంది. టెస్ట్-ట్యూబ్ అధ్యయనాలు గోధుమ గడ్డి క్యాన్సర్ కణాలను చంపడానికి, క్యాన్సర్ అభివృద్ధిని తగ్గించడంలో సహాయపడుతుందని నిరూపించాయి. అలాగే మానవ అధ్యయనంలో ఇది కీమోథెరఫీ దుష్ప్రభావాలను తగ్గిస్తుందని తేలింది. అంతే కాకుండా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి, తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పని వలన బాగా ఒత్తిడికి గురయ్యే వారికి ఒత్తిడిని తగ్గించడానికి ఈ జ్యూస్ ఒక మెడిసిన్ లాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో అంటువ్యాధులు కానీ ఏ ఇతర వ్యాధులు సోకకుండా ఈ జ్యూస్ మన శరీరంలో నిరంతరం పోరాడుతుంది. నెలసరి సమయాల్లో మహిళలకు అధిక రుతుస్రావం సమస్యను తగ్గించటానికి గోధుమ గడ్డి జ్యూస్ మంచి ఉపశమనం కలిగిస్తుంది.

శరీర కణాల పునర్జన్మ

గోధుమ గడ్డి శరీర కణాల పునర్జన్మకు సహాయపడుతుంది, తద్వారా శరీరానికి నష్టం కలిగితే అది త్వరగా నయం చేస్తు్ంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి.. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. అలాగే జీర్ణకోశంలోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.

Also Read: మూడ్ స్వింగ్స్ సమస్యా ? అయితే ఈ ఫుడ్ తినండి !

గోధుమ గడ్డి రసం తయారి విధానం

ముందుగా గోధుమ గడ్డిని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న గడ్డిని మిక్సీ గిన్నెలో వేసి, కొద్దిగా వాటర్ పోసి జ్యూస్‌లా చేసుకోవాలి. తర్వాత అందులో ఉన్న పిప్పిని తీసివేయాలి. చివరగా జ్యూస్‌లో నిమ్మకాయ పిండి రసాన్ని బాగా కలిపి తాగడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. గోధుమ గడ్డిని ఇంటి పేరట్లోనే పెంచుకున్నట్లయితే గడ్డి లేతగా ఉన్నప్పుడే కోసుకొని జ్యూస్ చేసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి.

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×