Health Tips: నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. మూడ్ స్వింగ్స్ ఒక సాధారణ సమస్యగా మారాయి. కొన్నిసార్లు తరచుగా చిరాకు, బాధ లేదా ఎటువంటి కారణం లేకుండా అశాంతి, ఇవన్నీ మన శరీరానికి మానసిక సమతుల్యత అవసరమని సూచించే సంకేతాలు కావచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మన ఆహారపు అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. కానీ మనలో చాలా తక్కువ మంది దీనిని తీవ్రంగా పరిగణిస్తారు.
మెదడులోని రసాయనాల సమతుల్యతను కాపాడి, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలలో లభించే పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా మెదడును కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. శరీరానికి సహజమైన రీతిలో విశ్రాంతినిస్తాయి. మీరు తరచుగా మానసిక స్థితిలో హెచ్చుతగ్గులతో బాధపడుతుంటే.. మీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా మీరు పెద్ద తేడాను గమనించవచ్చు.
మానసిక స్థితి మార్పులను తగ్గించే 5 ఆహారాలు:
అవకాడో – సెరోటోనిన్ పెంచే సూపర్ ఫుడ్:
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి6 , ఫోలేట్ ఉంటాయి. ఇవి మెదడు సెరోటోనిన్ అనే “మంచి అనుభూతిని కలిగించే” హార్మోన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. అంతే కాకుండాఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు టోస్ట్, స్మూతీ లేదా సలాడ్ కు అవకాడోను కలిపి తినవచ్చు. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల మూడ్ స్వింగ్స్ సమస్య తగ్గుతుంది.
డార్క్ చాక్లెట్ :
ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు, కెఫిన్ , థియోబ్రోమిన్ వంటివి ఉంటాయి. ఇవి తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడి లక్షణాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. ప్రతిరోజూ 1-2 ముక్కలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన కూడా తగ్గుతుంది.
చేపలు – మెదడుకు పోషణనిస్తుంది:
సాల్మన్, ట్యూనా , మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటుంది. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా మానసిక స్థితిని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఇది నిరాశ, ఆందోళన లక్షణాలను కూడా తగ్గిస్తుంది. వారానికి రెండుసార్లు ఇలాంటి చేపలు తినడం వల్ల మెదడు, గుండె.. రెండింటికీ మేలు జరుగుతుంది.
అరటిపండు – సహజ శక్తిని పెంచేది:
అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్‌గా మారుతుంది. ఇందులో పొటాషియం , విటమిన్ బి6 కూడా ఉంటాయి. ఇది మనసును ప్రశాంత పరుస్తుంది. అందుకే.. మీరు ప్రతి రోజు ఉదయం అరటిపండును ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉండవచ్చు. అంతే కాకుండా ఇది మీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
Also Read: కాకరకాయ తింటే.. ఆశ్చర్యపోయే లాభాలు !
గింజలు, విత్తనాలు – మనస్సుకు శక్తివంతమైన ఆహారం:
బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి డ్రై ఫ్రూట్స్, విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్ , మెగ్నీషియం ఉంటాయి. ఇవి మానసిక అలసటను తగ్గిస్తాయి. అంతే కాకుండా ఇవి మెదడు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మానసిక స్థితిలో మార్పులను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. వీటిని మీరు స్నాక్‌గా తీసుకోవచ్చు లేదా స్మూతీలో కూడా చేర్చుకోవచ్చు.