BigTV English
Advertisement

Akkineni Nagarjuna : మామా అల్లుళ్లకు ఒకటే రోగం… భరించలేం అంటున్న నాగ్

Akkineni Nagarjuna : మామా అల్లుళ్లకు ఒకటే రోగం… భరించలేం అంటున్న నాగ్

Akkineni Nagarjuna : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో అక్కినేని నాగార్జున ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు నాగార్జున కెరియర్ లో ఉన్నాయి. ముఖ్యంగా నాగర్జున కెరియర్ లో కొన్ని క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. శివ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయినందుకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే గీతాంజలి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగార్జున కెరీర్ లో ఈ రెండు సినిమాలు మంచి ప్లస్. ఒక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నాగార్జున నటిస్తున్నారు. ఇద్దరు కూడా స్టార్ హీరోలు అవ్వడం విశేషం. కుబేర సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు నాగర్జున. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రజనీకాంత్, ధనుష్ ఈ మామ అల్లుళ్ళ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.


రజినీకాంత్ తో కూలి

నగరం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. సందీప్ కిషన్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కార్తీ హీరోగా చేసిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. చాలా ఆసక్తికరంగా ఆ సినిమాను డిజైన్ చేశాడు లోకేష్. కమల్ హాసన్ కెరియర్ లోనే విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించాడు. ఒక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే కూలీ సెట్స్ లో యాక్షన్ సీన్ మినహాయిస్తే షూటింగ్ టైంలో రజనీకాంత్ బాగా జోకులు వేస్తారట.


ధనుష్ తో కుబేర 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ (Dhanush) నటిస్తున్న సినిమా కుబేర. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఇదివరకే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అయితే కుబేర సెట్స్ లో ధనుష్ ఎలా ఉంటాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగార్జున. మామూలుగా ధనుష్ చాలా సైలెంట్ గా ఉంటారట. తన క్యారెక్టర్ లో ఉన్నంతసేపు ఆ మూడ్ క్యారీ చేస్తాడు. అయితే షూట్ అయిపోయిన తర్వాత అందరితో కూడా మాట్లాడుతాడు. ఇద్దరు మామ అల్లుళ్ళతో కలిసి నాగార్జున సినిమా చేయడంతో ఈ విషయాలను పంచుకున్నారు. అయితే మొత్తానికి ఇద్దరు కూడా సెట్ లో చాలా సైలెంట్ గా ఉంటారు అని తెలిపారు.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×