E-Paper
Advertisement

తెల్ల గుడ్లు మంచివా? గోధుమ రంగు గుడ్లా? కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి!

తెల్ల గుడ్లు మంచివా? గోధుమ రంగు గుడ్లా? కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి!
Advertisement

White eggs vs Brown eggs: గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయిని మన అందరికీ తెలిసిన విషయమే అయితే సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు మన మనసులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న.. “తెల్ల గుడ్లు మంచివా? లేక గోధుమ రంగు గుడ్లు మంచివా?” అని.. బ్రౌన్ కలర్ గుడ్లు కాస్త రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవే హెల్తీ అని చాలా మంది భావిస్తారు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి ? ఏది కొనడం బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం!

వైట్ ఎగ్స్ vs బ్రౌన్ ఎగ్స్:

మనం డైలీ లైఫ్‌లో విపరీతంగా వాడే ఫుడ్ ఐటమ్స్ లో కోడి గుడ్డు ఒకటి. ప్రోటీన్ పవర్‌ హౌస్ అనదగ్గ ఈ ఎగ్స్ కొనేటప్పుడు చాలా మంది బ్రౌన్ ఎగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆర్గానిక్, నాటు కోడి గుడ్లు అనే భ్రమలో ఎక్కువ రేట్ ఇచ్చి మరీ కొంటుంటారు. కానీ సైన్స్ ఏం చెబుతోంది? వాటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు..

గుడ్డు రంగు ఎందుకు మారుతుంది?

Advertisement

గుడ్డు రంగు అనేది పూర్తిగా కోడి బ్రీడ్ మీద ఆధారపడి ఉంటుంది. తెల్ల ఈకలు, తెల్లటి చెవి తమ్మెలు ఉండే కోళ్లు సాధారణంగా తెల్ల గుడ్లను పెడతాయి. ఎరుపు లేదా గోధుమ రంగు ఈకలు, ఎర్రటి చెవి తమ్మెలు ఉండే కోళ్లు బ్రౌన్ గుడ్లను పెడతాయి. కాబట్టి గుడ్డు రంగు కేవలం జెనెటిక్స్ వల్ల మాత్రమే మారుతుంది తప్ప, వాటి క్వాలిటీ వల్ల కాదు.

పోషకాల పరంగా తేడా ఉందా?

అమెరికన్ కెమికల్ సొసైటీ, న్యూట్రిషన్ రీసెర్చ్ గ్రూప్స్ తేల్చింది ఏంటంటే తెల్ల గుడ్డులో, బ్రౌన్ గుడ్డులో ఉండే పోషకాలు దాదాపు వంద శాతం ఒకటే! రెండింటిలోనూ ఒకే పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, మంచి కొవ్వులు ఉంటాయి. బ్రౌన్ ఎగ్ తిన్నా, వైట్ ఎగ్ తిన్నా మీ శరీరానికి అందే క్యాలరీలు, ప్రోటీన్లు సమానంగానే ఉంటాయి. కాబట్టి ఒక రంగు గుడ్డు ఎక్కువ హెల్తీ, మరో రంగు గుడ్డు తక్కువ హెల్తీ అని అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే.

రుచి ఎందుకు మారుతుంది?

Advertisement

కొందరు బ్రౌన్ గుడ్లు ఎక్కువ రుచిగా ఉంటాయని చెబుతుంటారు. నిజానికి గుడ్డు యొక్క రుచి, లోపల ఉండే పచ్చసొన రంగు అనేది ఆ కోడి తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. పచ్చగడ్డి, నాణ్యమైన ధాన్యం, పురుగులు తిన్న కోళ్ల గుడ్ల సొన ఎక్కువ పసుపు లేదా నారింజ రంగులో ఉండి, టేస్ట్ కూడా కాస్త భిన్నంగా, బాగుంటుంది. అంతే కానీ గుడ్డు పెంకు రంగుకి, రుచికి ఎలాంటి సంబంధం లేదు. పోషకాలున్న ఫుడ్ తినే ఏ కోడి గుడ్డు అయినా సరే రుచిగా ఉంటుంది.

Also Read: క్యూ-మార్ట్‌లో క్యూ కడుతున్న జనం.. వైరల్ అవుతున్న‘కొరియన్ ఐస్ కప్’ ట్రెండ్!

బ్రౌన్ ఎగ్స్ ధర ఎందుకు ఎక్కువ?

బ్రౌన్ ఎగ్స్ పెట్టే.. కోళ్లు సాధారణంగా సైజులో ఉంటాయి. వాటికి కావలసిన మేత కూడా ఎక్కువే. వాటిని పెంచడానికి, వాటి పోషణకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కావడం వల్లే మార్కెట్లో బ్రౌన్ ఎగ్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప వాటిలో అదనపు పోషకాలు దాగి ఉన్నాయని కాదు. ఈ సింపుల్ లాజిక్ తెలియక చాలా మంది ఎక్కువ రేట్ ఉన్న బ్రౌన్ గుడ్లే ఆరోగ్యానికి మంచివని భ్రమపడుతుంటారు.

ఏ గుడ్డు కొనడం బెస్ట్?

మీ బడ్జెట్ తక్కువగా ఉండి, సేమ్ పోషకాలు కావాలనుకుంటే.. హ్యాపీగా వైట్ ఎగ్స్ కొనేసుకోవచ్చు. లేదు, మీకు బ్రౌన్ ఎగ్స్ లుక్ నచ్చినా లేదా ఆర్గానిక్ ఫీల్ కావాలనుకున్నా మీ ఛాయిస్ ప్రకారం బ్రౌన్ ఎగ్స్ తీసుకోవచ్చు. అంతిమంగా రెండు గుడ్లు ఇచ్చే ప్రోటీన్ బలం ఒక్కటే. కాబట్టి మీకు ఏది వీలైతే ఆ గుడ్డును ఎంచుకోండి. ఇకపై మార్కెట్ కి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా.. కొనండి.

Related News

కీటకాలు, నెగటివ్ ఎనర్జీ మాయం.. ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

వర్షంలో పూర్తిగా తడిసిపోయారా? వెంటనే ఈ పనులు చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరం

స్కిన్‌కేర్‌ సంబంధించిన 7 అపోహలు.. మెరిసిపోయే ఆరోగ్యమైన చర్మం కోసం ఫ్యాక్ట్ చెక్ చేయండి

వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్నారా? తాగే ముందు తప్పనిసరిగా ఈ 5 విషయాలు చెక్ చేయండి

మైదా లేకుండానే క్రిస్పీ పేపర్ సమోసా.. హెల్తీ స్నాక్ ఇంట్లోనే సులభంగా చేసే రెసిపీ

వాషింగ్ మెషీన్‌లో వెనిగర్ వేస్తే ఏమౌతుందో తెలుసా? ఇన్నాళ్లూ ఈ సూపర్ ట్రిక్ తెలియక నష్టపోయాం!

వైన్ బాటిల్స్ ఎప్పుడూ 750ml ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న క్రేజీ హిస్టరీ తెలిస్తే..

Big Stories

Advertisement
×