Hair Oil for Hair Growth: సాధారణంగా అమ్మాయిలు.. ఎవరికి వారు అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే వాటిలో పొడవాటి జుట్టు ఉంటే.. ఇంకా అందంగా ఉండాలని భావించి, దాని కోసం రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక కొందరైతే పని కూడా పక్కన పెట్టి, పొడవాటి జుట్టు కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ డాక్టర్స్ ఇచ్చిన హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడుతూ .. ఉన్న జుట్టును కోల్పోతున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్స్ ట్రై చేయండి. తల కూడా మోయలేనంత జుట్టు పెరుగుతుంది.
1.కావాల్సిన పదార్ధాలు
ఆవాల నూనె
మందారం ఆకులు
మందారం పువ్వులు
గోరింటాకు
కరివేపాకు
మెంతులు
కలోంజీ సీడ్స్
ఉల్లిపాయ తొక్కలు
వేపాకులు
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో కావాల్సినంత ఆవాల నూనె, మందారం ఆకులు, మందారం పువ్వులు, గోరింటాకు, కరివేపాకు, మెంతులు, కలోంజీ సీడ్స్, ఉల్లిపాయ తొక్కలు, వేపాకులు వేసి 20 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి గాజు సీసాలో వడకట్టుకోండి. ఈ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేస్తే.. జుట్టు విపరీతంగా పెరుగుతుంది.
పొడవాటి జుట్టుకోసం ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి. అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి.
2. కావాల్సిన పదార్ధాలు
రైస్ వాటర్
మెంతులు
కరివేపాకు
విటమిన్ ఇ క్యాప్సూల్స్
తయారు చేసుకునే విధానం
ముందుగా రైస్ వాటర్ తీసుకుని అందులో.. కరివేపాకు, మెంతులు 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టుని అందులో.. విటమిమ్ ఇ క్యాప్సూల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకుని.. 10 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత.. తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు విపరీతంగా పెరుగుతుంది. జుట్టు సిల్కీగా కూడా ఉంటుంది.
జుట్టు పొడవుగా పెరిగేందుకు హెయిర్ మాస్క్
3.కావాల్సిన పదార్ధాలు
అవిసెగింజెలు
మెంతులు
ఆముదం
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో గ్లాస్ వాటర్, అవిసెగింజలు వేసి 10 నిమిషాల పాటు మరిగించండి. జెల్ తయారు అవుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి అందులో తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేరెగిన్నెలోకి వడకట్టుకోవాలి. ఆ జెల్ వాటర్‌లో మెంతులు అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని మెత్తగా మిక్సీపట్టుకోవాలి. ఈ పదార్ధంలో టీ స్పూన్ ఆముదం, టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు పెట్టుకోండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. పట్టులాంటి కురులు మీ సొంతం అవుతుంది.
Also Read: ఈ ఒక్క నూనెకు ఇంత పవరా..? ఇంట్లోనే తయారుచేసే ఈ ఆయిల్‌ను జుట్టుకు రాస్తే మ్యాజిక్కే..!
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.