BigTV English

Kiss and Eyes: రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కళ్ళు వాటికవే ఎందుకు మూసుకుపోతాయి?

Kiss and Eyes: రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కళ్ళు వాటికవే ఎందుకు మూసుకుపోతాయి?

ప్రేమ జంట లేదా భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరగా వచ్చినప్పుడు అందమైన అనుభూతి కలుగుతుంది. వారి మధ్య భావోద్వేగ సంబంధం కూడా పెరుగుతుంది. వారు ముద్దు పెట్టుకునేటప్పుడు ప్రపంచాన్నే మరిచిపోతారు. ఆ క్షణంలో వారికి తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయి. కానీ ముద్దు పెట్టుకునేటప్పుడు మన కళ్ళు ఎందుకు మూసుకుపోతాయో అన్న విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ముద్దుకు, కళ్లు మూసుకుపోవడానికి మధ్య అనుబంధం ఏంటో తెలుసుకుందాం.


కళ్లు మూసుకుంటేనే అనుభూతి
ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుపోవడం అనేది ఆ క్షణాలను మరింత అందంగా అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ క్షణం బాహ్య ప్రపంచం నుండి వారిని దూరం చేస్తుంది. ఇష్టమైన వ్యక్తికి దగ్గర చేస్తుంది. ఇతర పనులేవీ ఇంద్రియాలు చేయవు. చూడడం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం అన్నీ పక్కన పెట్టేస్తాయి. కేవలం ముద్దును ఆ క్షణంలో అనుభూతి చెందుతాయి. అదే అందులో ఉండే మాయాజాలం.

మెదడు చేసే మాయ
ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుపోవడం అనేది మెదడు చేసే ఒక ప్రక్రియ. కళ్ళు మూసుకొని ముద్దు పెట్టుకోవడం వల్ల మెదడు ఆ క్షణంలోని ఆనందాన్ని పూర్తిగా అనుభూతి చెందడం పై దృష్టి పెడుతుంది. ప్రేమను మరింత లోతుగా అనుభూతి చెందుతుంది. మీ హృదయం ఆ క్షణంలో పూర్తి ప్రశాంతంగా ఉంటుంది.


జీవితంలోని కొన్ని అందమైన అనుభూతులను కళ్ళు మూసుకుంటేనే పూర్తిగా అనుభవించగలం. ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమించి ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోవాలి. అదే నిజమైన ప్రేమ నటించే వ్యక్తుల కళ్ళు తెరుచుకునే ఉంటాయి. నిజంగా ఆ క్షణాన్ని అనుభూతి చెందే వ్యక్తికి కళ్ళు మాత్రం వాటికవే మూసుకుపోతాయి. ఆ క్షణం వారి మధ్య సంబంధాన్ని మాత్రమే అంతర్లీనంగా చూడగలుస్తుంది ఆ జంట. చుట్టుపక్కల ఉన్న పరిసరాలను ఏమాత్రం చూడలేరు. అప్పుడు హృదయం మాత్రమే పనిచేస్తుంది. పంచాంద్రియాలు తమ క్రియలను ఆపేస్తాయి.

హ్యాపీ హార్మోన్లు
ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకు పోయినప్పుడు బయట ప్రపంచం పూర్తి అస్పష్టంగా మారుతుంది. ఆ సమయంలో ఉన్నది మీరు, మీ భాగస్వామి మాత్రమే అనిపిస్తుంది. ఒకరి శ్వాసను మరొఒకరు అనుభూతి చెందగలుగుతారు. ఆ స్పర్శను కూడా ఆనందంగా స్వీకరిస్తారు. ముద్దు పెట్టుకునేటప్పుడు సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఇద్దరి హృదయాలను మరింత దగ్గర చేస్తాయి.

లండన్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన కూడా చేశారు. ఏదైనా వస్తువును చూస్తూ తాకడం కన్నా… కళ్ళు మూసుకొని తాకినప్పుడే దానిని ఎక్కువగా అనుభూతి చెందుతామని ఆ పరిశోధనలో తేలింది. అందుకే భాగస్వాములు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి.

ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వారిని ముద్దు పెట్టుకునే వ్యక్తి కళ్ళు కచ్చితంగా మూసుకుంటాయి. అలా కాకుండా నటిస్తున్న వ్యక్తి కళ్ళు తెరిచే ఉంటాయి. ఇది కూడా ప్రేమలోని నిజాయితీని కనిపెట్టే ఒక పరీక్షగానే చెప్పుకోవచ్చు.

Related News

Cancer: వందలో 70 మందికి క్యాన్సర్.. వణికిస్తున్న తాజా అధ్యయనాలు !

Jamun Seeds: నేరేడు గింజలతోనూ లాభాలే.. తెలిస్తే అస్సలు పడేయరు !

Beetroot For Skin: ఫేషియల్స్ అవసరమే లేదు.. పండగ సమయంలో ఇలా చేస్తే మెరిసిపోతారు

Hair Straightener: హెయిర్ స్ట్రెయిట్నర్‌ ఇలా వాడితే.. జుట్టు ఊడటం ఖాయం !

Longevity Youthful Traits: అత్యంత వృద్ధ మహిళ డిఎన్ఏలో షాకింగ్ రహస్యాలు.. ముసలితనంలోనూ యవ్వనంగా

Alum For Dark Circles: మైక్రో ప్లాస్టిక్‌తో ముప్పు.. మెదడు, ఎముకలపై ప్రభావం, పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

Alum For Dark Circles: పటికతో డార్క్ సర్కిల్స్‌కి చెక్.. ఒక్కసారి వాడితే బోలెడు బెనిఫిట్స్

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Big Stories

×