BigTV English

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రధాన నిందితుడికి గ్రీన్‌కార్డు, అధికారుల మల్లగుల్లాలు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రధాన నిందితుడికి గ్రీన్‌కార్డు, అధికారుల మల్లగుల్లాలు

phone tapping case:  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్‌ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుకు ఇండియాకు రానట్టేనా? అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత గ్రీన్ కార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిందా? అధికారుల ఉదాసీనతే ఇందుకు కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు రేపో మాపో హైదరాబాద్ కు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తీరా అసలు విషయం తెలిశాక షాకవ్వడం పోలీసుల వంతైంది.

కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుకు అమెరికా గ్రీన్‌కార్డు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అమెరికాలోని కుటుంబ సభ్యుల ద్వారా ఆయన గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి కేసు దర్యాప్తు అధికారుల ఆరా తీశారు. కానీ ఆయన ఎక్కడున్నారో ఆచూకీ తెలుసుకోలేక పోయారు.


ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసులో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభాకర్ రావు గ్రీన్ కార్డు హోల్డర్ కావడంతో ఎన్నిరోజులైనా అమెరికాలో ఉంచవచ్చు. ఈ లెక్కన ఆయన హైదరాబాద్‌కు వచ్చే ఛాన్స్ లేదన్నమాట.

ALSO READ: కొంప ముంచిన ఫార్ములా ఈ రేస్, కేటీఆర్ చుట్టూ ఉచ్చు.. రంగంలో ఈడీ?

పాస్ట్‌పోస్టు రద్దు విషయాన్ని భారత్ ఎంబసీ ద్వారా అక్కడి అధికారులకు చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ అధికారుల్లో మొదలైంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల వరకు ఆరోగ్యం బాగాలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు మాజీ ఎస్ఐబీ చీఫ్. ఫలితాలు వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ మధ్యకాలంలో అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు జారీ చేసిన సందర్భాలు లేవు. కొత్త ప్రభుత్వం జనవరి నుంచి కొలువు తీరనుంది. ఈలోగా పాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉండదని అంటున్నారు. అక్కడి ప్రభుత్వం గ్రీన్‌కార్డులను ఎవరికైనా జారీ చేశారా అనేదానిపై ఆరా తీస్తే ఆయన వ్యవహారం గుట్టు రట్టువుతుందని అంటున్నారు.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×