Trisha : త్రిష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన హీరోయిన్ అని అడిగితే ఇప్పటికీ చాలామంది త్రిష పేరు చెబుతారు. అంతటి ఫాలోయింగ్ ను సాధించుకుంది త్రిష. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా త్రిష కు విపరీతమైన క్రేజ్ ఉంది అనే విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇకపోతే తెలుగులో సూపర్ హిట్ సినిమాలు త్రిష కెరియర్ లో ఉన్నాయి. అలానే తమిళ్ లో కూడా సూపర్ హిట్ సినిమాలు త్రిష కెరియర్ లో ఉన్నాయి. అయితే విజయ్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. త్రిష విజయ్ కాంబినేషన్ అంటే అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ముఖ్యంగా తమిళ్ ప్రేక్షకులకు ఆ క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. వీరిద్దరూ కలిసి రీసెంట్ గా లియో అనే సినిమాలో కనిపించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.
సెకండ్ ఇన్నింగ్స్
ప్రతి నటుడు కెరియర్ లో ఎత్తు పల్లాలు ఉంటాయి. కొన్నిసార్లు అవకాశాలు విపరీతంగా వస్తాయి. రెస్ట్ లేకుండా పని చేసే రోజులు కూడా ఉంటాయి. మరి కొన్నిసార్లు అవకాశాలు లేక రెస్ట్ తీసుకునే రోజులు కూడా ఉంటాయి. ఇక త్రిష విషయానికి వస్తే సినిమాలు చేయడం తగ్గించేస్తుంది అనుకునే టైంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవి పాత్రలో కనిపించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. అలానే ఈ సినిమా కూడా చాలామందికి అర్థం కాలేదు అనేది కూడా వాస్తవం. ఈ సినిమా తర్వాత త్రిష వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది.
వాళ్ళ ముగ్గురితో కలిసి పనిచేయాలి
ప్రతి ప్రేక్షకుడికి తమ అభిమాన నటీనటులను ఈ పాత్రలో చూడాలి అని కోరిక ఉండటం సహజం. అలానే మా అభిమాన హీరోలు ఈ దర్శకులతో పని చేయాలి అని కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. అయితే స్వతహాగా కొంతమంది హీరో, హీరోయిన్లకు కూడా కలిసి పనిచేయాలని నటీనటులు ఉంటారు. అలా త్రిష విషయానికి వస్తే కమలహాసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ వీళ్ళ ముగ్గురితో కలిసి పనిచేయాలని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకుందట. వీళ్ళ సినిమాలు చూస్తూ తాను పెరిగానని చెప్పుకొచ్చింది. అయితే యాదృచ్ఛికంగా వీళ్ళు ముగ్గురితో కలిసి ఒకే సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ హీరోగా థగ్ లైఫ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు త్రిష నటిస్తున్నారు. మొత్తానికి త్రిష అనుకున్న కల నెరవేరింది అని చెప్పాలి.
Also Read : Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ అప్పుడే తెలుగు హీరో తో ట్రై చేశాడు, అది జరుగుంటే వేరేలా ఉండేది