BigTV English

Anemia: ఎనీమియా ఎందుకు వస్తుంది..? అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే

Anemia: ఎనీమియా ఎందుకు వస్తుంది..? అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే

Anemia: చాలా మంది ఆడవారు ఎనీమియా సమస్యతో ఇబ్బంది పడతారు. రక్తంలో హిమోగ్లోబిన్ లోపించినప్పుడు లేదా ఎర్ర రక్త కణాలు తగ్గిపోయినప్పుడు ఈ సమస్య వస్తుందట. కొన్ని సార్లు ఎర్ర రక్త కణాలు పనితీరు మందగించినప్పుడు కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందట. ఫలితంగా రక్త కణాలకు చాలా తక్కువ మొత్తంలో ఆక్సీజన్ అందుతుంది. దీన్ని రక్తహీనత అని కూడా పిలుస్తారట.


హిమోగ్లోబిన్ తగినంతగా లేనప్పుడు, బాడీలోని సెల్స్‌కి అవయవాలకు ఆక్సిజన్‌ అందదు. దీని వల్ల శరీరంలోని అనేక అవయవాలపై కూడా చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎనీమియా అనేది వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఎనీమియా లక్షణాలు:
ఎనీమియా లక్షణాలు మొదట్లోనే గుర్తించడం కష్టమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎనీమియా ముదురుతున్న కొద్దీ దీని లక్షణాలు బయటకు వస్తాయట. తలతిరగడం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి ఎనీమియా కరణంగానే జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


చిన్న పిల్లల్లో అయితే ఎనీమియా వల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉండే ఛాన్స్ ఉందట. ఎనీమియాతో ఇబ్బంది పడుతున్న వారిలో చర్మం లేత రంగులోకి మారిపోతుందట. తరచుగా కాళ్లు చేతులు చల్లబడిపోతాయి.

ఎనీమియా ఎందుకు వస్తుంది?
గాయాలు, యాక్సిడెంట్స్ అయినప్పుడు శరీరంలోని ఎక్కువ రక్తాన్ని కోల్పోవడం వల్ల కూడా ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉందట. చాలా మందిలో ఐరన్ లోపించడం వల్ల ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం వల్ల కూడా రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉందిని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సార్లు NSAIDs వంటి పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కూడా శరీరంలో ఐరన్ డెఫీషియెన్సీ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. చాలా మందిలో విటమిన్-B12 లోపించినప్పుడు రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉందట.

ఎనీమియాను తగ్గించడమెలా..?
ఎనీమియా సమస్య నుంచి బయటపడేందుకు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పాలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకు కూరలను ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. అంతేకాకుండా బ్లడ్‌లో ఐరన్ పెరిగేందుకు కూడా ఇవి హెల్ప్ చేస్తాయట.

రెడ్ మీట్, చికెన్, చేపలు వంటి వాటిని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన పోషణతో పాటు ఐరన్ లెవెల్స్ కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే విటమిన్-B12 లోపంతో ఇబ్బంది పడుతున్న వారు పాలు, పాలుతో చేసిన పదార్థాలు, గుడ్లు తీసుకోవడం ఉత్తమం.

కొన్ని సార్లు ఎంత పోషకాహారం తీసుకున్నా ఐరన్ పెరగదు. అలాంటి సమయంలో ఎనీమియా నుంచి తప్పించుకోవడానికి డాక్టర్ల సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×