Dandruff: చుండ్రు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడతారు. శరీరంలోని అనేక వ్యవస్థలలో జరిగే మార్పుల వల్ల కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉందట. వీటితో పాటు చుండ్రు అనేది ఇతర కారణాల వల్ల కూడా వస్తుందట.
ముఖ్యంగా ఒత్తిడి, డీహైడ్రేషన్, పౌష్టికాహార లోపం, నిద్రపోవడం లేకపోవడం, వాతావరణ మార్పులు, ఇతర శారీరక సమస్యల వల్ల చుండ్రు వచ్చే ఛాన్స్ ఉంది. దీని వల్ల హెయిర్ ఫాల్ సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దీన్ని తగ్గించుకోవడానికి ఖరీదైన షాంపూలు, నూనెలు, సీరమ్స్ వాడినా కొన్ని సార్లు ఫలితం కనిపించకపోవచ్చు. అలాంటి సమయంలో కొన్ని పద్దతుల ద్వారా చుండ్రు సమస్య నుంచి బయట పడొచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
చుండ్రు తగ్గించే ఆయుర్వేద చిట్కాలు:
చుండ్రును తగ్గించడానికి బ్రాహ్మీ, శంఖపుష్పి మిశ్రమం బాగా పని చేస్తుందట. దీంతో మర్దనా చేయడం వల్ల రక్తప్రవాహం పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మెదడును ఉత్తేజితం చేయడంలో హెల్ప్ చేస్తాయట. వీటిని పాలతో కలిపి తీసుకోవచ్చట. లేదా కషాయంలా కూడా తీసుకోవచ్చు.
తులసి:
తులసి ఆకులు కూడా చుండ్రును తొలగించేందుకు హెల్ప్ చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకులను అల్లంలో కరిగించి పాలతో కలిపి తీసుకుంటే చుండ్రు తగ్గిపోతుందట.
అల్లం:
ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో అల్లం చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రసాన్ని నేరుగా తీసుకోవడం లేదా కూరల్లో వేసుకొని తింటే చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.
ALSO READ: సమ్మర్‌లో పైనాపిల్ తింటే ఏమవుతుంది..?
నీళ్లు, నిద్ర:
ప్రతిరోజు 7-8 గంటల నిద్రపోవడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీరు లేకపోతే చుండ్రుకు కారణమవుతుందట. కాబట్టి రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్క్రీన్ టైం:
ఎక్కువ సమయం పాటు కంప్యూటర్, మొబైల్ పరికరాలను వాడడం వల్ల కూడా చుండ్రు సమస్య పెరిగే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు స్క్రీన్ టైంని తగ్గించడమే మంచిది. ఎక్కువ ఒత్తిడి లేదా అస్తవ్యస్తమైన జీవితశైలి వలన చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మనసును శాంతపరిచే మెడిటేషన్ చేయడం ఉత్తమం.
ఫుడ్:
ఆయుర్వేద చిట్కాలు పాటించడం మాత్రమే కాకుండా చుండ్రు తగ్గాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాట. పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా విటమిన్-B, C, సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి.