Bath after Eating: భోజనం చేయగానే స్నానం చేయకూడదని పెద్దలు చెబుతారు. ఏముందిలే అని చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే భోజనం చేయగానే స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. అందుకే పెద్దలు కూడా తినగానే స్నానం చేస్తే ఒప్పుకరోరని అంటున్నారు.
భోజనం చేయగానే జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో ఉంటుందట. ఈ జీర్ణక్రియ జరుగుతున్న సమయంలో జీర్ణ అవయవాలకు ఎక్కువ రక్తం ప్రవహిస్తుందట. ఇలా జీర్ణ వ్యవస్థకు ఎక్కువ రక్తప్రసరణ జరిగినప్పుడు ఆహారం త్వరగా అరిగిపోవడానికి సహాయపడుతుందట.
తిన్న వెంటనే స్నానం చేస్తే..?
భోజనం చేయగానే స్నానం చేయడం వల్ల శరీర టెంపరేచర్‌ని బాలన్స్ చేయడానికి చర్మానికి రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుందట. దీంతో జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా జీర్ణక్రియపై చెడు ప్రభావం పడి తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందట.
దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినగానే స్నానం చేస్తే కడుపు ఉబ్బరం, అజీర్తితో పాటు కడుపులో అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: ఏది ముట్టుకున్నా షాక్ కొడుతోందా..?
అందుకే భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత స్నానం చేయడం మంచిదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పదు అనిపిస్తే భోజనం చేసిన తర్వాత కాళ్లు చేతులు కడుక్కుంటే మంచిదట. దీని వల్ల జీర్ణక్రియపై కూడా ఎలాంటి చెడు ప్రభావం పడదని అంటున్నారు.
జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంతో పాటు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే భోజనం చేసిన వెంటనే స్నానం చేయకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.