ఒక కొత్త అధ్యయనంలో స్త్రీ నుండి సలహా తీసుకోవడం వల్ల పురుషుడికి ఎలాంటి లాభాలు కలుగుతాయో వివరించింది ఈ కొత్త అధ్యయనం. స్త్రీల మాట ఎందుకు వినాల్లో కూడా చెబుతుంది.
ఇంట్లో స్త్రీలు తమ మాట వినమని మగవాళ్ళను అడుగుతూ ఉంటారు. కానీ మహిళల మాట వినేందుకు ఎంతో మంది మగవారు ఇష్టపడరు. కానీ ఒక సరికొత్త అధ్యయనంలో స్త్రీ నుండి సలహా తీసుకోవడం మంచిదేనని తెలుస్తోంది. స్త్రీ నుండి సలహా తీసుకొని పనులు చేయడం వల్ల మెరుగైన పరిష్కారాలు దొరుకుతాయని కూడా అధ్యయనం చెబుతోంది.
స్త్రీలు ఇతరులకు సహకారం అందించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. పురుషులకంటే ఎక్కువ సమతుల్య దృక్పథాలను కలిగి ఉంటారు. వారు ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే వారు ఇచ్చే సలహా విజయాలకు దారితీస్తుందని అంటారు.
స్త్రీలు తార్కికంగా కాకుండా భావోద్వేగపరంగా కూడా ఆలోచిస్తారు. పురుషులు ఇంట్లో, కార్యాలయంలో సవాళ్లతో కూడిన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. కానీ మహిళలు ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా అన్ని రకాలుగా ఆలోచించి మంచి నిర్ణయాలే తీసుకుంటారు. అందుకే దీర్ఘకాలిక విజయాలకు స్త్రీ నుంచి సలహా తీసుకోవడం ఎంతో మంచిది.
గత కొన్నేళ్లుగా మహిళలు స్వయంగా బయటకు రావడం, కార్యాలయంలో లీడర్ షిప్ పాత్రల్లోకి మారడం వంటివి జరుగుతున్నాయి. సమాజంలో ఆమె పాత్ర చాలా వేగంగా ఎదుగుతుంది. కాబట్టి మీ జీవితంలోని స్త్రీలను విలువైన వారిగా గుర్తించండి.
కిరాణా సామాగ్రి కొనడం నుంచి కారు కొనడం వరకు ఏ పని అయినా కూడా ఆమె అభిప్రాయాన్ని తీసుకుంటేనే మంచిది. ప్రతి అంశంలోను ఆమెను పాలు పంచుకునేటట్టు చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఆ విషయంలో విజయం దక్కే అవకాశం ఉంటుంది.
పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకోవడం, ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడం వంటి పనులు చేయకూడదు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఇద్దరూ ఒక జట్టులా ఉండాలి. ముఖ్యంగా తండ్రి మాట వినడం చూస్తూ పెరిగిన పిల్లలు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారని అంటారు.
Also Read: జంటలను చూసి కుళ్లుకోకండి.. ఒంటరిగా ఉండటం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయ్!
మీ భార్య ఉద్యోగస్తురాలే కావక్కర్లేదు. ఇంట్లో గృహిణి అయినా పర్వాలేదు… ఆమె నిర్ణయాన్ని కచ్చితంగా అడగండి. అది పొదుపు గురించి అయినా పెట్టుబడి గురించి అయినా మీరిద్దరూ ఒక జట్టుగా ముందుకు సాగితే ప్రతి నెల ఆదా చేసేది కూడా ఎక్కువే అవుతుంది.
ఇప్పటికీ ఆడవాళ్ళ నిర్ణయాలు అడగడం ఏంటి? అని పౌరుషానికి పోయే పురుషులు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే అవి తమకు తామే నిర్ణయాలుగా తీసుకుంటారు. నిజానికి ఇంట్లో సమస్యలకు పరిష్కారాలను సరిగ్గా చూపించేది స్త్రీనే. స్త్రీలు పురుషుల కంటే భిన్నంగా ఉంటారు. అందరి మంచి గురించి ఆలోచిస్తారు. మహిళలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెకు మంచిగా అనిపించేలా మాట్లాడాలి. ఆమెను చులకనగా చేసి మాట్లాడకండి.