BigTV English

Thriller Movie OTT : ఊహించని ట్విస్ట్ తో స్టోరీ.. ఫ్రెండ్స్ గా ఉండాలన్న జంట.. చివరికి..

Thriller Movie OTT : ఊహించని ట్విస్ట్ తో స్టోరీ.. ఫ్రెండ్స్ గా ఉండాలన్న జంట.. చివరికి..

Thriller Movie OTT : తమిళ ఇండస్ట్రీ నుంచి ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మాత్రమే కాదు. కామెడీ సినిమాలు కూడా జనాలను ఆకట్టుకుంటున్నాయి.. థియేటర్లలో ఆకట్టుకోలేని సినిమాలు సైతం ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఆయా సంస్థలు సైతం మూవీ లవర్స్ ఆకట్టుకొనేందుకు కొత్త కంటెంట్ సినిమాలను అందిస్తుంది. తాజాగా ఓ తమిళ కామెడీ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ లోకి వచ్చేసింది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..


మూవీ & ఓటీటీ.. 

తమిళ మూవీ 2కే లవ్‌స్టోరీ థియేటర్ల లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీలలోకి వచ్చేస్తుంది. మార్చి 14న ఆహా తమిళ్‌ తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో 2కే లవ్‌స్టోరీ మూవీ రిలీజ్ అవుతోంది. ఆహా తమిళ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.. జగవీర్‌, మీనాక్షి గోవిందరాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. బాలా శరవణన్‌, ఆంటోనీ భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఓటిటిలోకి త్వరగా వస్తుందని అనుకున్నారు కానీ నెల వరకు ఓటిటిలోకి రాలేదు.. మరి ఈ సినిమా స్టోరీ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


Also Read:అదే లవ్ ఫెయిల్యూర్ కి కారణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న రాజు లవ్ స్టోరీ..!

స్టోరీ విషయానికొస్తే.. 

కార్తీక్, మోనిక వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు స్నేహం కోసం ప్రాణం ఇచ్చే ప్రాణమిత్రులు. చాలా ఏళ్లుగా వారి స్నేహం కొనసాగుతూ ఉంటుంది. వారి స్నేహబంధంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి?.. జీవితాంతం వీళ్ళు స్నేహితులుగానే ఉండాలనుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల స్నేహం ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ స్టోరీలో చూపించారు.. సినిమా స్టోరీ పరంగా కామెడీతో కడుపుబ్బ నవ్వించిన కూడా స్టోరీలో బలం లేకపోవడం తో ఆ సినిమా పెద్దగా థియేటర్లలో ఆడలేకపోయింది. దాంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మాటలు చెప్పాలంటే డిజాస్టర్ గా మారింది.. లవ్‌స్టోరీ లో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి గోవింద రాజన్ గతంలో తమిళంలో కోబ్రా, డీమాంటే కాలనీ 2 కే తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 2కే లవ్‌స్టోరీ డైరెక్టర్ సుసీంద్రన్ తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతున్న ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..  ఈ మధ్య కాలంలో ఓటిటీ లో కొచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. సినిమాలు భారీ సక్సెస్ ని అందుకోవడం తో పాటు భారీ వ్యూస్ ని కూడా రాబడుతూ ఓటిటి లో ట్రెండ్ అవుతున్నాయి.. తమిళ మూవీస్ కు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

 

Tags

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×