Aditi Sharma: ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలా కామన్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది నిజమే అనిపించేలా ఇప్పటివరకు చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకొని మరీ విడిపోయారు. అంతే కాకుండా ఈ విడాకుల విషయంలో చాలావరకు ఒకరిని ఒకరు దూషించుకుంటూ, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ విడిపోతారు. తాజాగా మరొక టీవీ యాక్టర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. హిందీ టీవీ యాక్టర్ అయిన అదితి శర్మ (Aditi Sharma).. తనను మోసం చేసిందంటూ తన భర్త రోడెక్కాడు. అంతే కాకుండా విడాకులు ఇవ్వడానికి కూడా తనను బాగా టార్చర్ పెట్టిందంటూ తన భర్త తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు.
యాక్టర్‌తో ప్రేమ
‘కలీరేన్’, ‘రబ్ సే హై దువా’ లాంటి సీరియల్స్‌లో నటించి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు సాధించింది అదితి శర్మ. తాజాగా అదితి భర్త అభినీత్ కౌశిక్ (Abhineet Kaushik).. ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ అసలు వీరి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల గురించి బయటపెట్టాడు. ఇప్పటివరకు అదితి, అభినీత్ పెళ్లి గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలియదు. దానికి కారణం వారు సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడమే అని చెప్పుకొచ్చాడు అభినీత్. నవంబర్ 2024న వారిద్దరూ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నామని రివీల్ చేశాడు. పెళ్లయ్యిందే కానీ.. అప్పటినుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పుడు ఆ గొడవ విడాకుల వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు.
సీక్రెట్ మ్యారేజ్
‘‘నేను 2020లో ఆన్‌లైన్ యాక్టింగ్ క్లాసులకు వెళ్తున్నప్పుడు అదితిని కలిశాను. నాలుగేళ్లు డేటింగ్ తర్వాత 2024లో పెళ్లి చేసుకున్నాం. తను నన్ను పదేపదే పెళ్లి చేసుకున్నాం అని అడిగింది. కానీ నేను అంత ప్రిపేర్ అయ్యి లేను. కానీ మీరు ప్రేమలో ఉన్నప్పుడు మెల్లగా అన్నింటికి ఒప్పుకుంటాం. ఇండస్ట్రీలో పెళ్లి అనేది ఒక పెద్ద విషయం కాబట్టి ఇది ఎవ్వరికీ తెలియకుండానే ఉంచాం. అదితి ఇప్పుడే కొత్తగా ఒక సీరియల్‌లో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అంతా బాగానే మొదలయ్యింది. అప్పుడే ఆ షోలోకి కొత్తగా మరొక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. తనే సమర్త్య గుప్త’’ అని తమ పెళ్లిలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయిన విషయం చెప్పుకొచ్చాడు అభినీత్.
Also Read: పిడుగులాంటి నిజం చెప్పిన సౌందర్య భర్త.. ఇప్పుడు మోహన్ బాబు పరిస్థితేంటో.?
అక్కడే దొరికింది
‘‘మా పెళ్లయిన నెలన్నర తర్వాత సమర్త్య అనే వ్యక్తి తన సీరియల్‌లో జాయిన్ అయ్యాడని, తనతో మాట్లాడాలని అదితి నాకు చెప్పింది. సమర్త్య తనతో సరిగ్గా ప్రవర్తించడం లేదని, అయినా అందరూ తనతో మాట్లాడమంటున్నారని చెప్పింది. కొన్నిరోజుల తర్వాత డిన్నర్‌కు వెళ్తున్నానని నాతో చెప్పి వెళ్లిపోయింది అదితి. అప్పుడే తన కార్ ట్రాక్ చేసినప్పుడు సొసైటీ బేస్మెంట్‌లో నాకు కనిపించింది. నేను అక్కడే ఎదురుచూస్తూ ఉన్నాను. ఉదయం అవ్వగానే సమర్త్య, అదితి బయటికొచ్చి షూటింగ్‌కు వెళ్లిపోయారు. ఈ విషయం తనను అడిగినప్పుడు నాకేం సమాధానం చెప్పలేదు’’ అని చెప్పుకొచ్చాడు అభినీత్. ఇప్పుడు తనకు విడాకులు ఇవ్వడానికి అదితి రూ.25 లక్షలు డిమాండ్ చేస్తుందని ఆరోపించాడు.