Big Tv Live Originals: డెస్క్ వర్క్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వారితో పాటు ఇతర జాబ్స్ చేసే వారు చాలా మంది రోజంతా కంప్యూటర్ ముందే గడపాల్సి వస్తుంది. దీని వల్ల కళ్లపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా స్క్రీన్ చూడడం వల్ల కంటిపై ఒత్తిడి పడుతుందట. దీని వల్ల సైట్ కూడా వస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కంటి చూపు శాశ్వతంగా దెబ్బతినదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, అది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుందట. దీనిని సాధారణంగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) లేదా డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని పిలుస్తారట.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడుతున్న వారిలో కొన్ని రకాల లక్షణాలు కినిపిస్తాయట. కళ్లు పొడిబారడం, నీరు కారడం వంటివి జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తలనొప్పి, మెడ, భుజం నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
దీని నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. 20-20-20 నియమాన్ని పాటించడం వల్ల కంటి చూపు సమస్యలు రాకుండా చేయడం సులభం అవుతుందని అంటున్నారు. ఈ నియమంలో ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు క్లోజప్ ఫోకస్ నుండి బ్రేక్ దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు తక్కువ రెప్పపాటు చేస్తారు.దీని వల్ల కళ్లు పొడిబారిపోతాయట. అందుకే క్రమం తప్పకుండా రెప్పవేయడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచితస్తున్నారు. అంతేకాకుండా కంప్యూటర్ స్క్రీన్ దూరం ఉండేలా చేయాలట. స్క్రీన్‌ను చేయి పొడవున ఉంచడం వల్ల కళ్లు దెబ్బతినకుండా ఉంటాయట.
ALSO READ: వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా..?
కంప్యూటర్ అధికంగా వాడే వారు కిటికీలు లేదా ఓవర్ హెడ్ లైట్ల నుండి ఎక్కువగా లైటింగా రాకుండా చూసుకోవాలి. అవసరమైతే యాంటీ-గ్లేర్ స్క్రీన్ ప్రొటెక్టర్లను ఉపయోగించడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
అలగే లాప్‌టాప్, ఫోన్ అధికంగా వాడే వారు రాత్రి సమయంలో బ్లూ లైట్ ఫిల్టర్లను వాడడం మంచిది. బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉన్న అద్దాలను వాడడం వల్ల కూడా ఈ సమస్యలు రాకుండా చేయడం సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వీటితో పాటు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి ప్రతి గంటకు కొన్ని నిమిషాలు నిలబడడం, నడవడం చేస్తే మంచిదట. ఇప్పటికే కళ్లు పొడిబారిపరోయి ఉంటే లూబ్రికేటింగ్ డ్రాప్స్ వంటివి వాడితే తేమగా ఉంచడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.