BigTV English

Amaravati Cricket Stadium: అమరావతిలో 150 ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… 10 టి20 మ్యాచ్ లు !

Amaravati Cricket Stadium: అమరావతిలో 150 ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… 10 టి20 మ్యాచ్ లు !

Amaravati Cricket Stadium : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆ దిశగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పెదలంక, చినలంక గ్రామాల్లో స్థలాలు అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు. మంత్రి పొంగునూరి నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు కలిసి స్థలాన్ని పరిశీలించినట్టు సమాచారం. అయితే అమరావతిలో నూతనంగా దేశంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి సిద్ధం చేస్తున్నారు.


ఈ మేరకు బీసీసీఐ కూడా సహకారం అందించనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణకు అనుగుణంగా స్టేడియం ఉండాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్ లక అనుకూలంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మంగళగిరి లో మ్యాచ్ లను నిర్వహించడం కష్టమే అంటున్నారు నిపుణులు. అందు కోసమే స్పోర్ట్స్ సిటీలో కొత్త స్టేడియాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్టు సమాచారం. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం మాదిరిగానే అతిపెద్ద స్టేడియం ఉండాలనే ఆలోచన చేస్తున్నారు. దాదాపు 1.25 లక్షల మంది కూర్చునే సామర్థ్యంతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

అమరావతి లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి దాదాపు 150 ఎకరాలకు పైగా స్థలం అవసరం అవుతుందని భావిస్తున్నారు. అక్కడ పార్కింగ్ వంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చులో దాదాపు 60 శాతం బీసీసీఐ భరిస్తుందని.. మిగిలిన 40 శాతం ఏసీఏ భరిస్తుందనే టాక్ వినపడుతోంది. అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల ఖర్చులో కొంత బీసీసీఐ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో కూాడా అతి పెద్ద అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం పూర్తయితే ప్రతీ సంవత్సరం 10 అంతర్జాతీయ మ్యాచ్ లను కూడా నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించినట్టు సమాచారం.


ఇటీవల దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోపీ మ్యాచ్ కి మంత్రి నారా లోకేష్ కూడా వెళ్లారు. అలాగే విశాఖ పట్నంలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కి వెళ్లారు. అక్కడ ఐసీసీ చైర్మన్ జైషాతో ఈ విషయం పై చర్చించినట్టు సమాచారం. అమరావతి స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ఇబ్రాహీంపట్నం గ్రామీణ మండలంలోని భూములను మంత్రి నారాయణ పరిశీలించారు. నది ప్రవాహానికి ఆటంకం కలుగకుండా భూమిని ఎంపిక చేయాలని చూస్తున్నామంటున్నారు. ఈ ప్రాజెక్ట్ సాధ్య, సాధ్యాలను పరిశీలించేందుకు కలెక్టర్ తో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నెల రోజుల్లో నివేది ఇవ్వాలని ఆదేశించారు. రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని.. దాదాపు 15వేల మంది కార్మికులు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. క్రీడా నగరం అభివృద్ధికి నది ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మెరక భూములు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు మంత్రి నారాయణ పేర్కొన్నట్టు సమాచారం. అమరావతిలో క్రికెట్ స్టేడియం వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానులు వీక్షించేందుకు చాలా సులభంగా ఉంటుందనే చెప్పవచ్చు. 

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×