BigTV English

Winter Hair Fall : చలికాలంలో జట్టు రాలిపోతోందా? మీ సమస్యకు ఇదే పరిష్కారం?

Winter Hair Fall : శీతాకాలం(చలికాలం)లో వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లగాలలు వీస్తూ ఉండడం వల్ల మనిషి శరీరంలో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఇదే పరిస్థితి వెంట్రకలలో కూడా ఉంటుంది. దీని వల్ల చర్మం, శిరోజాలు పొడి బారిపోతాయి. దీనివల్ల జుట్టులో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.

Winter Hair Fall : చలికాలంలో జట్టు రాలిపోతోందా? మీ సమస్యకు ఇదే పరిష్కారం?

Winter Hair Fall : శీతాకాలం(చలికాలం)లో వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లగాలలు వీస్తూ ఉండడం వల్ల మనిషి శరీరంలో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఇదే పరిస్థితి వెంట్రకలలో కూడా ఉంటుంది. దీని వల్ల చర్మం, శిరోజాలు పొడి బారిపోతాయి. దీనివల్ల జుట్టులో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.


తేమ శాతం తగ్గిపోవడం వల్ల జుట్టు కుదుళ్లు పొడిబారిపోయి బలహీనంగా ఉంటాయి. దీంతో వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. ఈ సమస్య చాలామందిలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.

మరి ఈ సమస్య పరిష్కారం చాలా సులువే. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అందించాలి.


చలికాలంలో జుట్టుకు నూనె చాలా అవసరం
ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు నూనె పట్టించడానికి ఇష్టపడరు. నూనె ప్రకృతిపరమైన కండిషనర్. ఇది మాయిశ్చరైజర్‌లా కూడా ఉపయోగపడుతుంది. తలపై ఉన్నచర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
జుట్టుకు కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్, జొజొబా ఆయిల్, ఆముదం లాంటివి వారానికి రెండుసార్లు పట్టించాలి. ఇవి జుట్టు కుదళ్లలోని తేమ శాతాన్ని తగ్గిపోకుండా కాపాడుతుంది.

ప్రతి రోజు తల స్నానం చేయకూడదు
చలి కాలంలో ప్రతి రోజు తల స్నానం చేయకూడదు. తలస్నానం అంటే రోజూ జుట్టుకు షాంపు చేయడం. అలా చేసి తడి జుట్టుతో బయటకు వెళకూడదు. అలా చేస్తే గాలిలోని దుమ్ము, చెత్త సులువుగా జుట్టుకు అంటుకుంటుంది. దాని వల్ల జుట్టు మరింత బలహీనపడుతుంది.

జుట్టుకు ఎక్కువ వేడి తగలకూడదు
చాలామంది హెయిర్‌ స్టైలింగ్‌ కోసం తరుచూ జుట్టును కొన్ని పరికరాలతో వేడి చేస్తూ ఉంటారు.
అలా చేయడంతో వెంట్రుకలు మరింత బలహీనమవుతాయి. అలాగే ఎక్కువగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎక్కువ వేడి తగిలితే చర్మం, జుట్టులోని సహజనూనె శాతం తగ్గిపోయి నిర్జీవంగా మారుతుంది. ఆ తరువాత రాలిపోవడం ఇంకా ఎక్కువ అవుతుంది.

పోషకాహారం తీసుకోవాలి
ఆహారంలో మంచి పోషక విలువలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా శిరోజాలకు బలం చేకూర్చే విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉన్నవి చలికాలంలో తినాలి.దీని వల్ల జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు బలంగా కనిపిస్తుంది.

నాణ్యమైన హెయిర్‌ కేర్‌ ఉత్పత్తులు ఉపయోగించాలి
జుట్టు బలంగా ఉండడానికి మంచి కండిషనర్లు, షాంపూలు వంటివి వాడాలి. నాణ్యత లేనివి తీసుకుంటే అందులో రసాయనాలు ఉంటాయి. వాటి వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. సహజ ఉత్పత్తులైన కుంకుడు కాయలు, కొబ్బరినూనె, కలబంద గుజ్జు, షీకాకాయ వంటివి ఉపయోగిస్తే జుట్టు బలంగా తయారవుతుంది. వీటిలో రసాయనాలు ఉండవు కాబట్టి ఎటువంటి నష్టం ఉండదు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×