Winter Skin Care: చలికాలం రాగానే చర్మం పూర్తిగా పొడిబారుతుంది. అంతే కాకుండా కొంత మంది చర్మంపై డ్రై స్కిన్ తొలగిపోతుంది. మరికొంత మందికి స్కిన్‌పై మంటగా కూడా అనిపిస్తుంటుంది. ఈ సీజన్‌లో స్కిన్ కేర్ పాటించడం చాలా అవసరం. మఖ్యంగా గాలిలోని తేమ చలికాలంలో స్కిన్ త్వరగా పొడిబారేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో ముఖంతో పాటు చేతులు, కాళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ద అవసరం.
చలికాలంలో మీ చేతులపై ఉన్న చర్మం పొడిబారి ముడతలు పడినట్లు కనిపిస్తే రెండు నిమిషాల్లో మృదువుగా మార్చుకోవచ్చు. చలికాలంలో వీచే చల్లని గాలులు మొదట చేతులను నిర్జీవంగా , పొడిగా మారుస్తాయి. దీని కారణంగా చేతులు అసహ్యంగా కనిపిస్తాయి. చేతులు మృదువుగా చేయడానికి కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా మీరు చలికాలంలో స్కిన్ మెరిసేలా చేసుకోవచ్చు. ఇవి క్షణాల్లో మీ చేతులను మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా ముడతలను కూడా తొలగిస్తాయి.
ఉప్పుతో శుభ్రం:
చలికాలంలో మీ చేతులపై ముడతలు, పొడిబారినట్లు కనిపిస్తే ఉప్పుతో మసాజ్ చేయండి. ఈ పద్ధతి వల్ల చేతులు తక్షణమే మృదువుగా మారతాయి. దీనికి కావలసిందల్లా కోల్డ్ క్రీమ్ , ఉప్పు. మీ చేతుల్లో కోల్డ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ తీసుకోండి. తర్వాత దానితో పాటు అర టీస్పూన్ ఉప్పు తీసుకోండి. ఇప్పుడు రెండింటినీ కలపండి . తర్వాత మీ చేతులను ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగేయండి. ఈ పద్ధతి చర్మాన్ని పూర్తిగా మారుస్తుంది. అంతే కాకుండా ఇలా చేస్తే.. చనిపోయిన చర్మం అంతా క్లియర్ అవ్వడమే కాకుండా మీ చేతులు మృదువుగా, ముడతలు లేకుండా కనిపిస్తాయి. ఈ చలికాలంలో తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి. మీ చేతుల్లో తేడా చూడండి.
చక్కెర , నూనెతో స్క్రబ్ చేయండి:
చేతుల చర్మంపై జిగ్గు కనిపిస్తే చలికాలంలో తప్పకుండా దానిని తొలగించడానికి కొబ్బరి నూనెలో చెక్కరను కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ముతక చక్కెర పేస్ట్ ఏర్పడే వరకు చెక్కర కలపండి. ఇప్పుడు చేతులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. దీంతో చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిపోయి చేతులు మృదువుగా, మెరుస్తూ ఉంటాయి.
Also Read: మేకప్ అవసరమే లేదు, ముఖానికి ఆవిరి పడితే చాలు.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్
స్కిన్ కేర్:
చర్మం మెరిసేలా చేయడానికి, కేవలం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అప్లై చేయడం మాత్రమే కాదు వాటికి బదులుగా, మీరు మీ దినచర్యలో కొన్ని ప్రత్యేక టిప్స్ పాటించాలి. ఇందుకోసం ఉదయం లేవగానే ముందుగా మలాసనంలో కూర్చుని రెండు మూడు గ్లాసుల వేడినీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట బాగా క్లీన్ అవడమే కాకుండా చర్మం మెరిసిపోతుంది. ఫ్రెష్ అయిన తర్వాత ఉసిరి, క్యారెట్, బీట్‌రూట్ , కలబంద వంటి వాటితో చేసిన జ్యూస్ త్రాగాలి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు లోపల నుండి మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.
సహజమైన వస్తువులతో ముఖాన్ని కడగాలి:
ముఖం మెరిసేలా చేయడానికి, దానిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు కొన్ని సహజమైన వస్తువులను ఉపయోగించవచ్చు. ఇవి మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా చర్మం యొక్క సహజ నూనెను కూడా నిలిచి ఉండేలా చేస్తాయి. దీని కారణంగా చర్మం చాలా పొడిగా , నిస్తేజంగా మారదు. మీరు ముఖాన్ని శుభ్రం చేయడానికి ముల్తానీ మిట్టి పొడి, పెరుగు, పసుపు మరియు శనగపిండి, పచ్చి శనగ పొడి, పచ్చి పాలు, గంధపు పొడి మొదలైన సహజ పదార్థాలను ఉపయోగించవచ్చు.