BigTV English

Women Diet: 30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Women Diet: 30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Women Diet: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న తనం నుంచే ఎదుటి వారికి అందంగా కనిపించాలని భావిస్తారు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్ల కారణంగా త్వరగా ఏదో ఒక చర్మ సమస్యల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యంగా త్వరగా వృద్ధాప్యం బారిన పడుతున్నారు. 30 ఏళ్లు దాటితే చాలు జీవితంలో అనేక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా వివాహితల జీవితంలో ఎదుర్కునే సమస్యల కారణంగా త్వరగా ముసలి తనం వెంటాడుతుంది. అయితే 30 ఏళ్లు దాటిన మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.


తృణ ధాన్యాలు :

తృణ ధాన్యాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి వాటిలో ఉండే ఫైబర్ ఆరోగ్యాన్ని రక్షించడానికి తోడ్పడుతుంది. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. అంతేకాదు ఇది బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది.


పెరుగు :

ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. అంతేకాదు ఇది జీర్ణ వ్యవస్థలను కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును ప్రతీ రోజూ సలాడ్, చట్నీ లేదా ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకుంటే మంచిది.

ఆకు కూరలు :

ఆకుకూరల్లో కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ుంటాయి. ఇందులో మెంతి కూర, ఆవాలు, బచ్చలికూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. వీటితో తయారుచేసే సలాడ్ తో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

గింజలు – విత్తనాలు :

తరచూ తీసుకునే ఆహారంలో బాదం, చియా సీడ్స్, వాల్ నట్స్ వంటివి తీసుకుంటే ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

పండ్లు :

పండ్లు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. పండ్లను తరచూ స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×