BigTV English

TTD Ex EO Dharmareddy: ధర్మారెడ్డి ఎక్కడ? ఆచూకీ చెబితే నజరానా

TTD Ex EO Dharmareddy: ధర్మారెడ్డి ఎక్కడ? ఆచూకీ చెబితే నజరానా

TTD Ex EO Dharmareddy: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ? విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఆయన కనిపించడం మానేశారా? వైసీపీ పెద్దలే ఆయనను అజ్ఞాతంలోకి వెళ్లమని ఆదేశించారా? తిరుమల లడ్డూపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నా, ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? కేవలం మాజీ ఛైర్మన్లు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. లడ్డూ వివాదం వెనుక ధర్మారెడ్డి రోల్ ఉందా? ఇవే ప్రశ్నలు సగటు భక్తులను సైతం వెంటాడుతున్నాయి.


ధర్మారెడ్డి పేరు తెలుగు ప్రజలకు బాగా సురిచితం. ఎందుకంటే గడిచిన ఐదేళ్లుగా టీటీడీలో అన్నీ తానై వ్యవహరించారు. కరోనా సమయంలో ఆయన సేవలు భక్తులు మరిచిపోలేరు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తొలిసారి తిరుమల వెళ్లారు. టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలను అక్కడి సిబ్బంది సీఎం దృష్టికి రావడంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారాయన. వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన సీఎం చంద్రబాబు, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెడతానని కుండబద్దలు కొట్టేశారు.

ALSO READ: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..


ఈ వ్యవహారం తర్వాత ధర్మారెడ్డి మచ్చుకైనా కనిపించలేదు. ఆ తర్వాత టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. ధర్మారెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారనే ప్రచారం జోరుగా సాగింది. ఇంకో విషయం ఏంటంటే.. టీటీడీలో జరిగిన అక్రమాలపై అంతర్గతంగా విచారణ చేపట్టింది. ఆనాటి నుంచి ఆయన కనిపించలేదని టీటీడీ సిబ్బంది చెప్పుకొచ్చారు. వైసీపీ పెద్దలు ఆయనను దూరంగా ఉండమని సలహా ఇచ్చారని అంటున్నారు. లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా ఆయన స్పందించ లేదు.

దీంతో మాజీ EO ధర్మా రెడ్డి కనబడుట లేదని, ఆచూకీ తెలిపిన వారికి రూ.1116 రూపాయలు బహుమతి ఇస్తామని బీజేపీకి చెందిన ఓ నేత స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అందుకు సంబంధించి ఫ్లెక్సీ కూడా రిలీజ్ చేశారాయన. తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని వ్యాఖ్యానించారు. సిట్ వేగంగా దర్యాప్తు చేసి అనుమానాలకు పుల్ స్టాఫ్ పెట్టాలని కోరారు ఆ నేత.

 

 

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×