BigTV English

Rava Dosa: బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? పెరుగు రవ్వ కలిపి ఇలా దోశలు వేసేయండి

Rava Dosa: బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? పెరుగు రవ్వ కలిపి ఇలా దోశలు వేసేయండి

ప్రతిరోజూ ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ ఉండాల్సిందే. అలాగని అన్ని రోజులు ఒకటే పెడితే పిల్లలు తినరు. తక్కువ సమయంలో టేస్టీగా ఉండే బ్రేక్ ఫాస్ట్ లు చేయాలి. మీరు కూడా అలాంటి సింపుల్ అల్పాహారం కోసం వెతుకుతూ ఉంటే ఇక్కడ మేము పెరుగు, రవ్వ కలిపి దోశ ఎలా చేయాలో చెప్పాము. ఇది రుచికరమైన రెసిపీ. పైగా ఇది చాలా తక్కువ సమయంలోనే సిద్ధమైపోతుంది. కేవలం 10 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు టేస్టీ దోశలు సిద్ధంగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


రవ్వ పెరుగు దోశకు కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ – ఒక కప్పు
పెరుగు – అరకప్పు
నీరు – అరకప్పు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయల తరుగు – మూడు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను
పసుపు – పావు స్పూను
కారం – పావు స్పూను
నూనె – తగినంత

రవ్వ పెరుగు దోశ రెసిపీ
1. ఒక గిన్నెలో ఒక కప్పు ఉప్మా రవ్వను వేయాలి. అందులోని పెరుగును అలాగే నీటిని వేసి బాగా కలపాలి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి.
2. ఇలా చేయడం వల్ల పెరుగు, రవ్వ, నీరు బాగా కలుస్తాయి. అవి ఉబ్బినట్టు అవుతాయి.
3. ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
4. రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. అవసరమైతే నీటిని కలుపుకోవచ్చు.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని దోశ పిండిలాగా మందంగా వచ్చేలా కలుపుకోవాలి.6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
7. ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి. పైన ఉల్లిపాయలు చల్లుకోవాలి.
8. ఎర్రగా కాలాక తీసి ప్లేట్లో వేసుకోవాలి. దీన్ని గ్రీన్ చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది.
9. లేదా టమోటో చట్నీ కొబ్బరి చట్నీతో తిన్న అదిరిపోతుంది.


సాధారణ దోశలతో పోలిస్తే ఇది చాలా తక్కువ సమయంలోనే సిద్ధమైపోతుంది. అంతేకాదు రుచి కూడా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాంటి దోశలు తినే కన్నా ఇలా ప్రత్యేకంగా అప్పుడప్పుడు చేసుకొని తింటే ఆ రుచే వేరు. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో రవ్వ పెరుగు కలిపి క్రంచి, క్రిస్పీ దోశలను వేసే మీ పిల్లలకు పెట్టండి. ఇది వారికి కచ్చితంగా నచ్చుతాయి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×