SJ Suryah:విలక్షణ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు ఎస్.జే.సూర్య (SJ Suryah). సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా కూడా తన ప్రతిభను కనబరుస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో ప్రధానంగా పనిచేస్తున్న ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీకి వచ్చి 57 ఏళ్లు అవుతున్నా.. ఇంకా వివాహం చేసుకోకపోవడం పై పలువురు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్.జే. సూర్య తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అందుకే పెళ్లి చేసుకోలేదు – ఎస్ జె సూర్య
ఇంత వయసొచ్చినా వివాహం చేసుకోకపోవడానికి కారణం అదే అంటూ తెలిపి అందరిని ఆశ్చర్యపరిచారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్ జె సూర్య మాట్లాడుతూ..” లక్ష్యం కోసం పరిగెడుతూనే ఉన్నాను. అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు. సినిమాల్లో ఇంకా నేను నా లక్ష్యాన్ని చేరుకోలేదు” అంటూ తెలిపారు. మొత్తానికైతే తాను అనుకున్న లక్ష్యం ఏమిటో? ఆ లక్ష్యాన్ని ఎందుకు ఇంకా చేరడంలో ఆలస్యం అవుతుందో? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ లక్ష్యాన్ని ఎప్పుడు చేదిస్తారు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండగా.. మరికొంతమంది 60 ఏళ్లలో పెళ్లి చేసుకొని ఎవరిని ఉద్దరిస్తారు అంటూ వ్యంగంగా కూడా కామెంట్లు చేస్తున్నారు.
కిల్లర్ నుండీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
ఇక ఎస్ జె సూర్య విషయానికి వస్తే.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ (Rajinikanth ), కమలహాసన్(Kamal Haasan) తరువాత అంతటి సీనియర్ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కిల్లర్’. ఇందులో నటిస్తున్నారు కూడా.. ఇక నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా కిల్లర్ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎస్.జే.సూర్య తెలుగు సినిమాలు..
ఖుషి సినిమాతో 2001లో దర్శకుడిగా మారి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత నాని చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఇక కొమరం పులి సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా రచయితగా కూడా పనిచేశారు. అంతేకాకుండా పలు చిత్రాలలో నటుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవలే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కూడా విలన్ గా నటించిన ఎస్ జె సూర్య స్పైడర్ , మెర్సల్ వంటి చిత్రాలలో కూడా విలన్ గా నటించారు.
ఎస్ జె సూర్య ఆస్తుల వివరాలు..
విలన్ పాత్ర కోసం రూ.6 నుంచి రూ.9 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈయనకు.. తన సొంత గ్రామంలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక కార్లు, సొంత ఇల్లు తో పాటు విలువైన స్థలాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆస్తుల విలువ రూ. 160 కోట్లుగా ఉంటుందని సమాచారం.
also read:Sonu Sood on Fish Venkat : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోను సూద్ ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలు అంటే ?