BigTV English

World IVF Day 2024: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..అసలు IVF అంటే ఏమిటి ?

World IVF Day 2024: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..అసలు IVF అంటే ఏమిటి ?

World IVF Day 2024: ప్రస్తుతం చాలా మంది జంటలు ఎదుర్కుంటున్న సమస్య సంతాన లేమి. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు ఓ వరం. అలాంటిది వరం అందరికీ దక్కడం లేదు. మారుతున్న జీవనశైలి, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల సంతాన లేమి సమస్య  రోజు రోజుకు పెరుగుతోంది. అలాంటి సమయంలో కృత్రిమ పద్ధతుల ద్వారా కూడా బిడ్డకు జన్మనివ్వవచ్చు.


ఇందుకు సంబంధించి అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఐవీఎఫ్ ఒకటి. ఈ పద్ధతిపై అవగాహన కోసం ప్రతి ఏటా జులై 25న ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని లేదా వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే నిర్వహిస్తుంటారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన మొదటి బిడ్డ పుట్టిన రోజునే ఐవీఎఫ్ డేగా నిర్వహిస్తున్నారు.

ప్రపంచ IVF దినోత్సవం..
1978 జులై 25వ తేదీన లాయిస్ జాయ్ బ్రౌన్ IVF విధానం ద్వారా జన్మించిన మొదటి శిశువు. ఆ రోజు నుంచి IVF, శిశువుల పుట్టుకకు నమ్మదగిన పద్ధతిగా గుర్తించబడింది. ఫలితంగా అప్పటి నుంచి IVF డే జరుపుకుంటున్నారు.
IVF అంటే ఏమిటి?..


IVF అనేది కృత్రిమంగా గర్భం దాల్చడానికి ఓ పద్ధతి. IVF అంటే ఇన్ విగ్రో ఫెర్టిలైజేషన్. ల్యాబ్‌లో అండాన్ని స్పెర్మ్‌తో ఫలధీకరణం చేయడం ద్వారా IVF ప్రక్రియ జరుగుతుంది. అండం విజయవంతంగా ఫలదీకరణం చెంది పిండంగా మారిన తరువాత దానిని గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. ప్రస్తుతం సంతానలేమితో ఇబ్బందిపడుతున్న వారు గర్భం ధరించడానికి ఈ ప్రక్రయ ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఈ పద్ధతిలో శిశువు ఆరోగ్యకరమైన పుట్టుక, తల్లి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాలు ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం:

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శరీరానికి అత్యవసరం. IVF చికిత్స తీసుకున్నప్పుడు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.

మంచి నిద్ర:
సంతానోత్పత్తిపై నిద్ర చాలా ప్రభావాన్ని చూపుతుంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెలటోనిన్ అనే హర్మోన్ విడుదల అవుతుంది. ఇది పునరుత్పత్తి పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిది.

కెఫిన్ మానుకోండి:
కెఫిన్ తీసుకోవడం వల్ల IVF చికిత్స అనేది సక్సస్ కాకపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది.
తేలిక పాటి వ్యాయామం:
ఆరోగ్యంగా ఉండటం కోసం తేలిక పాటి వ్యాయామం చేయడం అవసరం. IVF విధానంలో ఉన్నప్పుడు , తక్కువ తీవ్రత గల వ్యాయామాలను చేయాలి.
మానసిక ఆరోగ్యంపై దృష్టి:
ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు IVF పై ప్రభావం చూపుతాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇతరులతో సన్నిహితంగా ఉండండి. యోగా, ధ్యానం వంటివి చేయండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×