BigTV English

Bag Microwave : మీ షోల్డర్ బ్యాగే.. మైక్రోవేవ్

Bag Microwave : మీ షోల్డర్ బ్యాగే.. మైక్రోవేవ్
Bag Microwave

Bag Microwave : ఆహార పదార్థాలు ఏవైనా వేడి వేడిగా తింటే ఆరోగ్యానికి మంచిది. చల్లని ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అధిక శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. కానీ వేడి ఆహారం తీసుకోవడం ఎల్లవేళలా సాధ్యపడని విషయం. ముఖ్యంగా ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారికి వేడి ఆహారం తినడం అసలే కుదరదు. ఇలాంటి వారికి ఆ లోటును తీరుస్తోంది జపాన్‌కు చెందిన విల్టెక్స్ కంపెనీ.


ఆహార పదార్థాలను వేడిగా ఉంచేందుకు వీలుగా పోర్టబుల్ మైక్రోవేవ్‌ను రూపొందించింది. అంతే కాదండోయ్.. అవసరమైతే దానిని బీర్ కూలర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. మైక్రోవేవ్ అనగానే ఏదో బుల్లి పెట్టెను మోసుకెళ్లాలని అనుకుంటారేమో? కానే కాదు. షోల్డర్ బ్యాగ్‌గా దానిని డిజైన్ చేయడం విశేషం. ఈ విల్‌కుక్ బ్యాగ్‌ను ఎంచక్కా భుజాలకు తగిలించేసుకుని వెళ్లిపోవచ్చు.

లాస్‌వెగాస్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES) 2024లో దీనిని చూసిన వారు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ బ్యాగ్ పదంటే పది నిమిషాల్లోనే గరిష్ఠంగా 250 సెంటీగ్రేడ్ వరకు వేడి ఎక్కుతుంది. పదినిమిషాల్లో 90 డిగ్రీల సెంటీగ్రేడ్.. 20 నిమిషాల్లో 130 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వచ్చేస్తుంది. మైక్రోవేవ్ సగటు కుకింగ్ టెంపరేచర్ 100 డిగ్రీల సెంటీగ్రేడ్. సో.. ఇంటి ఆహారం ఉన్న టప్పర్‌వేర్‌ను ఈ బ్యాగ్‌లో పడేస్తే చాలు.


ఒకసారి ఆహారం వేడెక్కిన తర్వాత.. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి రెండు గంటల పాటు నిలిచి ఉంటుంది. పరికరం ఆఫ్‌లో ఉన్నా సరే.. ఆ మాత్రం వేడి లంచ్ టైమ్ వరకు ఉండగలదు. విల్‌కుక్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా హీట్ సెటింగ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ వేడి మన శరీరాన్ని తాకదా? అనే అనుమానం రావొచ్చు. ఆ సెగ తగలకుండా ఉండేందుకు కాటన్, అల్యూమినియం లేయర్లను షీల్డ్ మాదిరిగా ఏర్పాటు చేశారు. వేడిని బయటకు రాకుండా అవి నిలువరిస్తాయి.

విల్ కుక్ బ్యాగ్ ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికే కాదు.. చిన్నపాటి కూలర్‌గానూ వినియోగించుకోవచ్చు. 4-8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 3 గంటల పాటు బీర్లు చల్లదనాన్ని కోల్పోకుండా ఉంచగలదు. బ్యాగ్ బరువు జస్ట్ 280 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఫుల్ చార్జ్‌డ్ బ్యాటరీ 8 గంటల పాటు పవర్‌ను అందజేస్తుంది. మరో నాలుగు నెలల్లో తొలుత ఇది బ్రిటన్లకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత అమెజాన్‌లోనూ లభ్యం కాగలదు. దీని ధర రూ.12 వేల నుంచి రూ.16 వేల లోపు ఉండొచ్చు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×