BigTV English

Nails Colors : మీ ఆరోగ్యం.. మీ గోళ్ల రంగు చెప్పేస్తుంది..!

Nails Colors : మీ ఆరోగ్యం.. మీ గోళ్ల రంగు చెప్పేస్తుంది..!

Nails Colors : మగువులకు ఇష్టమైన వాటిలో గోళ్లు కూడా ఒకటి. వీటిని పెంచడానికి నానా కష్టాలు పడుతుంటారు. అంతే కాకుండా రంగులరంగుల నెయిల్ పాలిష్‌లు వాడుతూ గోళ్లను అందంగా తీర్చి దిద్దుతారు. గోళ్లకు మరింత బ్యూటీని చేర్చేందుకు పార్లర్‌‌కు వెళ్లి.. మ్యానీ క్యూర్, పెడిక్యూర్ చేయిస్తారు. గోళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఏదేమైనా గోళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన శరీరంలో దాగున్న చాలా అనారోగ్య సమస్యల గురించి ఇవి ముందుగానే సంకేతా ఇస్తాయట. గోళ్ల రంగే మన ఆరోగ్యాన్ని సూచిస్తుందట.


గోళ్ల రంగును మనం గమనిస్తూ ఉండాలి. గోర్లు ముందులా కాకుండా వేరే ఏదైనా రంగులోకి మారినట్లు ఉంటే అప్రమత్తం కావాలి. కొన్నిసార్లు.. మచ్చలు, గీతలు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడే వెంటనే అప్రమత్తమై డెర్మటాలజిస్టును కలవడం మంచిది. గోళ్లు అలా ఎందుకు మారాయో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించాలి.

గోళ్లపై వచ్చే మార్పులు చాలా వ్యాధులకు సంబంధం ఉంటుంది. శరీరంలోని చాలా అవయవాలను పీడిస్తున్న వ్యాధులకు మన గోర్లపై సంకేతాలు కనిపిస్తాయి.


వీటిలో ముఖ్యంగా పోషకాహార లోపం, చర్మం, కిడ్నీలు, వ్యాధి నిరోధక శక్తి సమస్యలకు సంకేతాలు గళ్ల మీదే కనిపిస్తాయి. కానీ గోళ్లపై ప్రతీసారి వచ్చే మార్పులు జబ్బులకు సంకేతాలని భావించకూడదు. కొన్ని సందర్భాలలో మన ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ గోరు మీద మార్పులు వస్తుంటాయి.

కాలి గోళ్లపై శ్రద్ధ పెట్టకపోతే.. కొన్ని సార్లు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవి పసుపు రంగులోకి మారిపోడవం లేదా పై పెచ్చులు ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. దీనిని వలేరియా జెనెల్లా అంటారు. ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదించాలి.

గోళ్లపై గీతలు

గోళ్లపై కొన్ని సార్లు నిలువుగా,సన్నగా గీతలు ఉంటాయి. హై ఫీవర్ లేదా కీమోథెరపీ లాంటీ చికిత్సల తర్వాత గోళ్లపై ఇలాంటి గీతలు వస్తాయి. మెలనోమా కూడా గోళ్లపై గీతలకు కారణం కావచ్చు. ఇది ఒక చర్మ క్యాన్సర్.

తెల్ల గోళ్లు

గోళ్లు తెల్లగా పాలిపోతే.. మైకోసిస్, సొరియాసిస్, న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్లు శరీరాన్ని పీడిస్తున్నాయని అర్థం. శరీరంలో పోషకాలు తగ్గినా లేదా ప్రోటిన్లు తక్కువగా తీసుకున్న గోళ్లు తెల్లగా మారచ్చు. రక్తహీనత కూడా దీనికి కారణం కావచ్చు. రక్తంలో ఐరన్ తగ్గినప్పుడు గోళ్లు తెల్లగా వస్తాయి.

పెళుసు గోళ్లు

గోళ్లు కొన్నిసార్లు పెళుసుగా అయిపోతుంటాయి. కెమికల్స్‌తో పనిచేసినప్పుడు ఇలా జరగుతుంది. ఇలాంటి సమయంలో గోళ్లకు క్రీమ్ లాంటివి పూయాలి. ఈ క్రీమ్ గోళ్లకు తేమ కోల్పోకుండా చేస్తాయి. అలానే శరీరానికి తగిన మోతాదులో విటమిన్లు, ప్రోటీన్లు అందకపోవడం వల్ల కూడా గోళ్లు పెలుసుగా మారుతుంటాయి. విటమిన్ బి 12 సప్లిమెంట్లు, పోషకాహార పదార్థాలు తీసుకోవడం వల్ల గోళ్లు పెళుసు బారకుండా చూడచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్

గోళ్లకు కొన్ని సందర్భాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దీన్ని అంత తేలికగా తీసుకోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స మొదలు పెడితే ఆరు నెలల వరకు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమస్య చేతి గోళ్లకు వస్తే.. మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుంది. ఇలాంటి వ్యాధులు ఉన్న రోగులకు దూరంగా ఉండాలి. వారు ఉపయోగించే వస్తువులను మనం వాడకపోవడమే మంచిది.

తెల్లని మచ్చలు

గోళ్లపై తెల్లని మచ్చలు కనిపించడాన్ని పిటింగ్ అంటారు. ఈ మచ్చలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గోళ్లపై వస్తాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలు ఉన్న వాళ్లకి గోర్లపై ఇలా మచ్చలు వస్తాయి. సొరియాసిస్, డెర్మటైటిస్ కూడా దీనికి సంకేతం కావచ్చు. గోళ్లపై వచ్చే ఈ తెల్లని ప్రాంతం క్రమంగా పెరుగుతూ వెళ్తుంటే.. ఎరియాటాగా, అలొపెసియా ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. దీనికి వెంటనే చికిత్స అవసరం.

పసుపు రంగు గోళ్లు

గోళ్లు ఒక్కోసారి పసుపు రంగులోకి మారుతుంటాయి. జన్యుపరమైనా వ్యాధులు లేదా వయసు పైబడిన ఈ రంగులోకి మారచ్చు. గోళ్లు ఈ రంగులోకి మారినప్పుడు కాస్త ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. గోళ్లపై వచ్చే ఈ మార్పును కంటితో చూసి గుర్తు పట్టొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా ఇలా జరిగే ప్రమాదం ఉంది. హుచ్ఐవీ, కిడ్నీ వ్యాధులు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు ఇది సంకేతం కావొచ్చు. పొగతాగే వారిలో కూడా గోళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. బొటనవేలు, చూపుడు వెళ్లలో ఈ తేడా తెలుస్తుంది.

నీలి రంగు గోళ్లు

గోళ్లు చాలా మందివి నీలి రంగులోకి మారుతుంటాయి. కొన్ని రకాల ఔషధాల ఉపయోగం వలన గోళ్లు ఈ రంగులోరి మారతాయి. ఇలా మారినప్పుడు మీరు వాడే మందులను మార్చుకోవాలి. మలేరియా మందులు వేసుకున్నప్పుడు ముఖ్యంగా గోళ్లు నీలిరంగులోకి మారతాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×