BigTV English

Wrong Parenting : పిల్లల పెంపకంలో ఈ తప్పులు వద్దేవద్దు..!

Wrong Parenting : తమ పిల్లలను గొప్పవారిగా తీర్చి దిద్దాలని తల్లిదండ్రులందరూ తపన పడతారు. పిల్లల పురోగతి కోసం ఎన్నో త్యాగాలూ చేస్తారు. అయితే.. ఈ క్రమంలో వారు కొన్ని వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సైకాలజిస్టులు సలహా ఇస్తున్నారు.

Wrong Parenting : పిల్లల పెంపకంలో ఈ తప్పులు వద్దేవద్దు..!

Wrong Parenting : తమ పిల్లలను గొప్పవారిగా తీర్చి దిద్దాలని తల్లిదండ్రులందరూ తపన పడతారు. పిల్లల పురోగతి కోసం ఎన్నో త్యాగాలూ చేస్తారు. అయితే.. ఈ క్రమంలో వారు కొన్ని వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సైకాలజిస్టులు సలహా ఇస్తున్నారు. పిల్లలు బాధ్యతగా ప్రవర్తించేలా చేయటంతో బాటు ఎప్పటికప్పుడు వారికి తగిన గైడెన్స్ ఇవ్వాలని, అప్పుడే పిల్లలు తమ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని వారు సూచిస్తున్నారు. పిల్లల పెంపకం విషయంలో పెద్దలు పాటించాల్సిన కొన్ని సలహాలు.. వారి మాటల్లోనే..


బి పాజిటివ్ : ఎదిగే పిల్లల్లో స్వతంత్ర భావాలుంటాయి. అన్నింటికీ పెద్దల మీద ఆధార పడకుండా.. కొన్ని విషయాల్లో వారు సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. దానిని తప్పుగా భావించి, వారి మీద కోపం ప్రదర్శించకూడదు. దీనికి బదులు.. వారు ఆ పనిని ఎందుకు చేశారో అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ.. వారి నిర్ణయం తప్పైతే.. ‘అది ఎందుకు తప్పు’ అనేది పిల్లలకు వివరించాలి. ఒకవేళ మంచిదైతే వారిని ప్రోత్సహించాలి. మొత్తంగా.. మీ పిల్లల పట్ల మీకు సానుకూల దృక్పథం ఉండాలి.

పోలిక వద్దు : మీ పిల్లలను ఇతరుల పిల్లలతో పోల్చవద్దు. ఒక్కొక్కరూ ఒక్కో వాతావరణంలో పెరుగుతారు కనుక పోలిక అనేది పిల్లల విషయంలో పనికిరాదు. చదువు విషయంలో ఇది అసలే పనికి రాదు. చీటికీ మాటికీ ఇతరులతో పోల్చటం వల్ల పిల్లలు.. తమ మనసులోని ఆలోచననలను తల్లిదండ్రులకు చెప్పటం మానేస్తారు.


ఇతరుల ప్రమేయం వద్దు: మీ పిల్లల గురించి ఎవరో ఏదో చెప్పారని వారిని ఎడాపెడా తిట్టటం, కొట్టటం అసలు పనికిరాదు. ఆటపాటల సమయంలో పిల్లలు తగాదా పడటం అత్యంత సాధారణ విషయం. అందుకే ఇలాంటి సమయంలో ‘ఏమైంది’ అని అందరు పిల్లలను అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా మీ పిల్లవాడి ప్రవర్తన తప్పు అయితే.. అతడితో తోటి పిల్లలకు సారీ చెప్పించి, మీరంతా మంచి ఫ్రెండ్స్ అని గుర్తుచేసి, వారు తిరిగి కలిసిపోయేలా చేయాలి.

రూల్స్ పెట్టొద్దు : క్రమశిక్షణ పేరుతో పిల్లల మీద ఒత్తిడి పెంచొద్దు. చదువు, ఆటపాటలు, స్నేహితుల వంటి విషయాల్లో వారికి తగినంత స్వేచ్ఛను ఇవ్వాలి తప్ప అన్నీ తాము చెప్పినట్లు జరగాలని పెద్దలు అనుకోకూడదు. వారితో మాట్లాడి, వారి ఆసక్తి ఏమిటో తెలుసుకుని ఆ తర్వాతే వారి విషయంలో ఏ నిర్ణయానికైనా రావాలి.

అతి పనికిరాదు : తల్లిదండ్రులంతా తమ పిల్లల విషయంలో గారాబం, కోపం వంటివి మోతాదు దాటకుండా చూసుకోవాలి. ఒక వయసు వచ్చి, సొంతగా నిర్ణయాలు తీసుకునే వరకు వారిని గమనిస్తూనే, అవసరమైన మేరకు స్వేచ్ఛనూ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అతిగారాబం వల్ల పిల్లలు అబద్ధాలు చెప్పటం, పెద్దల మాటను పట్టించుకోవటం మానేస్తారని గుర్తించాలి.

బాధ్యతలు ఇవ్వాలి : పిల్లలకు సంబంధించిన అన్ని పనులు మీరే చేయకూడదు. ఇంటిపని వగైరాల్లో వారు ఏదైనా పనిచేయబోతే.. ‘నువ్వింకా చిన్న పిల్లాడివే’ అంటూ వారిని నిరాశ పరచకుండా, చిన్న చిన్న పనులు అప్పగించి వారెలా చేస్తున్నారో గమనించాలి. వారు ఏదైనా పని బాగా చేస్తే ప్రోత్సహించాలి. వారు ఏదైనా విషయంలో తమ అభిప్రాయం చెబితే దానిని శ్రద్ధగా విని, అది తప్పో ఒప్పో లాజికల్‌గా చెప్పే బాధ్యత పెద్దలదే.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×