E-Paper
Advertisement

Snake bite: పాములు కాటేసే ముందు ఏం చేస్తాయో తెలుసా..?

Snake bite: పాము ఎదురుగా కనిపిస్తే తెలియకుండానే అడగు వెనక్కి పడుతుంది. పాము కాటుకు మనిషి అంతగా భయపడతాడు మరి. అయితే పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా.. కాటేసే ముందు ఏం చేస్తుందో చూద్దాం.

Snake bite: పాములు కాటేసే ముందు ఏం చేస్తాయో తెలుసా..?
Advertisement

Snake bite: పాము ఎదురుగా కనిపిస్తే తెలియకుండానే అడగు వెనక్కి పడుతుంది. పాము కాటుకు మనిషి అంతగా భయపడతాడు మరి. అయితే పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా.. కాటేసే ముందు ఏం చేస్తుందో చూద్దాం.

పాములను చూస్తే చాలు మనం భయంతో పరుగులు పెడతాం. కానీ పాములను చూసి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పాములకే మనం అంటే భయం.

Advertisement

పాములకు విషం అనేది వేటాడే ఆయుధం. దీని ద్వారానే పాములు ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకనే పాములు విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోడానికి ఏ దారి లేని పరిస్థితుల్లో మాత్రమే కాటు వేస్తాయి. పాము ఎదురైనప్పుడు కదలకండా ఉండిపోతే.. దానంతట అదే దూరంగా వెళ్లిపోతుంది.

పాములు శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉంటాయి. వేసవి కాలంలో బయటకి వచ్చి గుడ్లు పెడతాయి. వర్షాకాలంలో గుడ్లు నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఈ సమయంలోనే శీతాకాలానికి కావాల్సిన ఆహారం కోసం వేటాడుతాయి. ఎలుకలు, కప్పలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.

Advertisement

వెలుతురు తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువుగా సంచరిస్తాయి. పాములు చీకటిలోనే దాక్కుంటాయి. వెలుగులో ఉండటానికి ఇష్టపడవు.

ఇండియాలో ప్రధానంగా నాలుగు రకాల పాములు ఉన్నాయి. కట్లపాము, నాగుపాము, చిన్నపింజర, రక్తపింజర ఇవన్నీ విషపూరితాలు.

కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసేముందు హెచ్చరిస్తాయి. కట్లపాము ఎప్పుడు కాటు వేస్తుందో చెప్పలేం. మిగిలని పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ స్స్ స్స్.. అని శబ్ధం చేస్తాయి. పాముల ప్రవర్తనలో ఈ సంకేతాలను గమనించగలిగితే కాటు నుంచి తప్పించుకోవచ్చు.

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×