BigTV English

Pigmentation: పిగ్మెంటేషన్ సమస్యకు కీరతో చెక్ పెట్టొచ్చని తెలుసా?

Pigmentation: పిగ్మెంటేషన్ సమస్యకు కీరతో చెక్ పెట్టొచ్చని తెలుసా?

Pigmentation: పిగ్మెంటేషన్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని వల్ల ముఖంపై మచ్చలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. వీటి వల్ల చాలా మంది ఇబ్బంది కరంగా ఫీల్ అవుతారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాల సబ్బులు, క్రీంలు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో నేచురల్ పద్ధతిలో పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవడం సాధ్యం అవుతుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.


కీరతో పిగ్మెంటేషన్ సమస్యను కంట్రోల్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మచ్చలు, నల్లటి వలయాలు లేదా అసమాన చర్మ రంగు సమస్యలతో బాధపడేవాళ్లకు కీర సహజమైన, సులభమైన పరిష్కారం చూపిస్తుందని అంటున్నారు.

కీర ఎందుకు?
కీరలో విటమిన్-ఎ, సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ లాంటివి బోలెడు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, మచ్చలు తగ్గించడంలో హెల్ప్ చేస్తాయని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.


ఇందులో ఉండే విటమిన్-సి మెలనిన్‌ను కంట్రోల్ చేసి, ముదురు మచ్చలను లైట్ చేస్తుందట.

కీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయట. దీంతో చర్మం మెరుస్తుంది.

కీరలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంలో ఎరుపు, వాపును తగ్గించి చర్మాన్ని సాఫ్ట్‌గా మారుస్తాయి.

ఎలా యూజ్ చేయాలి?
కీర ఆకులను కొన్ని సింపుల్ రెమెడీలతో యూజ్ చేస్తే పిగ్మెంటేషన్ తగ్గడమే కాకుండా, చర్మం కూడా గ్లో అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రకరకాల ఫేస్ మాస్క్‌లు కూడా చేసుకునే ఛాన్స్ ఉందట. కీర ఫేస్ మాస్క్ ఎలా చేయాలంటే..

కీర ఫేస్ మాస్క్:
కీర ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి, 1 స్పూన్ తేనె, కొంచెం నిమ్మరసం కలపండి.
ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో కడగండి.
వారానికి 2 సార్లు చేస్తే మచ్చలు తగ్గి చర్మం బ్రైట్ అవుతుంది.

కీర జ్యూస్:
కీర ఆకులను జ్యూసర్‌లో వేసి రసం తీసి, కాటన్‌తో మచ్చలపై రాయండి.
10 నిమిషాల తర్వాత చల్లని నీటితో వాష్ చేయండి.
రోజూ చేస్తే మచ్చలు తగ్గుతాయి.

కీర + పెరుగు మాస్క్:
కీర పేస్ట్‌లో 2 స్పూన్ల పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి.
20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని సాఫ్ట్‌గా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతూ మచ్చలను తగ్గిస్తుంది.

జాగ్రత్తలు:
కీర ఆకులను బాగా కడిగి యూస్ చేయండి.
సెన్సిటివ్ స్కిన్ ఉంటే, మాస్క్ యూస్ చేసే ముందు చిన్నగా టెస్ట్ చేసుకోండి.
కీర జ్యూస్‌ను ఎక్కువసేపు ముఖంపై ఉంచొద్దు, లేకపోతే చర్మం డ్రై అవ్వొచ్చు.

డైట్‌లో కీర:
కీరను సలాడ్, స్మూతీలు లేదా కూరల్లో వేసుకుంటే బాడీ డిటాక్స్ అవుతుంది. ఇది చర్మానికి నేచురల్ గ్లో ఇస్తుంది.

రెగ్యులర్‌గా కీరను యూజ్ చేస్తే, పిగ్మెంటేషన్ తగ్గడమే కాదు, స్కిన్ హెల్తీగా, బ్రైట్‌గా కనిపిస్తుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.

Related News

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Brain Health:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది

High Cholesterol: గుండె జబ్బులు రాకూడదంటే ? నిపుణుల సూచనలివే !

Warning Signs of Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి ?

Signs of Kidney Damage: ఉదయం పూట ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? మీ కిడ్నీలు పాడైనట్లే !

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Copper Bottle: కాపర్ బాటిల్ వాటర్ తాగారో అంతే సంగతులు, వీళ్లకు మరీ డేంజర్!

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

Big Stories

×