BigTV English
Advertisement

Hit 3 : పెళ్లి కాని యువత కష్టాలివి… డైరెక్టర్ సాబ్ ఏమన్న చెప్పిండా?

Hit 3 : పెళ్లి కాని యువత కష్టాలివి… డైరెక్టర్ సాబ్ ఏమన్న చెప్పిండా?

Hit 3 : నాని (Nani) లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ మూవీపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఆయన “ఇది సీరియస్ మ్యాటర్” అంటూ ఓ పోస్ట్ చేశారు. మరి ఆ పోస్ట్ లో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే…


యావరేజ్ అబ్బాయిలకు ఇన్ని కష్టాలా ?

హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా రూపొందిన మూవీ ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే ఇందులో రావు రమేష్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. అడవి శేష్, కార్తీ లాంటి యంగ్ హీరోలు అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. మే 1న భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల పరంగా అదరగొడుతుంది.


ఈ నేపథ్యంలోనే తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. దానికి “మన యువత కష్టాలు… ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్ లో ‘హిట్ 3’ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే డిస్కషన్ కు సంబంధించిన వీడియో ఉండడం గమనార్హం. హీరోయిన్ హీరోని “చూడ్డానికి యావరేజ్ గా ఉన్నారు. సొసైటీలో మంచి పేరు ఉంది. అయినా ఎందుకు ఇన్ని రోజులు పెళ్లి కాలేదు?” అని ప్రశ్నించగా… నాని యావరేజ్ అబ్బాయిల కష్టాలను హీరోయిన్ ముందు ఏకరువు పెట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ 

ఇదిలా ఉండగా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఆరు రోజుల్లోనే లాభాల్లోకి అడుగు పెట్టడం విశేషం. ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకు పైగా గ్రాస్, 58 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ‘హిట్ 3’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 49 కోట్లకు జరిగింది. దీంతో 50 కోట్ల టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆరు రోజుల్లోనే ఆ మైలురాయిని టచ్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Read Also : ఇంట్లోనే సైకో కిల్లర్ ను పెట్టుకుని పండగ చేసుకునే బ్యాచ్… భయంతో అరుపులు పెట్టించే థ్రిల్లర్ మూవీ

ఈ ఏడాది అతి తక్కువ టైంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన తెలుగు సినిమాల్లో ఒకటిగా ‘హిట్ 3’ నిలిచింది. ఇక ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు కలిసివచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇదే జోష్ తో కొనసాగితే ఈ మూవీ 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ లేదు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందు ‘హిట్ 4’లో కార్తీ హీరోగా నటించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×