దానిమ్మ గింజలను తిన్నా లేక ఆ గింజ నుంచి తీసిన రసాన్ని తాగినా మనకి ఎంతో మేలు జరుగుతుంది. కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా దానిమ్మ రసం ఎంతో మేలు చేస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న దానిమ్మ అందాన్ని, చర్మ తేజస్సును పెంచుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా దీనికి ఎక్కువ.
ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి. దీనిలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, విటమిన్ బిలతోపాటు జీవక్రియకు కూడా ఇది మద్దతిస్తుందని. అలాగే ఇతర ఖనిజాలు కూడా దీనిలో సమృద్ధిగా ఉంటాయి.
దానిమ్మ నుంచి తీసిన రసంలో పాలీశాచురేటెడ్, మోనోపాలీశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ చేస్తుంది. మృదువుగా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మీ చర్మం మెరిసిపోవాలంటే ప్రతిరోజూ దానిమ్మ రసాన్ని తాగాలి. రోజుకి రెండు మూడు సార్లు తాగితే మీ చర్మం రెండు వారాల్లోనే మెరవడం మొదలవుతుంది. ఎలాంటి క్రీములు రాయాల్సిన అవసరం లేదు.
దానిమ్మ తినడం ద్వారానే కాదు దానిమ్మ రసాన్ని ముఖానికి పూయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది అనేక రకాలుగా చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది.
టోనర్
మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, మెరుపును అందించడానికి తాజాగా తీసిన దానిమ్మ రసాన్ని ముఖానికి పూయండి. ఇది అద్భుతమైన టోనర్ లాగా పనిచేస్తుంది. మురికిని మొత్తం తీసివేస్తుంది.
ఫేస్ మాస్క్
దానిమ్మ రసాన్ని తీసి ఒక చిన్న గిన్నెలో వేయండి. దానిలోనే తేనెను కలిపి ముఖానికి పట్టించండి. కాసేపు ఉంచాక ఫేస్ వాష్ చేసుకోండి. లేదా దానిమ్మ రసంలో కలబంద జెల్‌ను కలిపి ముఖానికి రాయండి. ఇలా చేయడం వల్ల ముఖం హైడ్రేటింగ్ గా అవుతుంది. చర్మం మెరుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే మీకు మంచి మార్పు కనబడుతుంది.
మాయిశ్చరైజర్
మాయిశ్చరైజర్ లక్షణాలు దానిమ్మరసంలో అధికంగానే ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక స్పూను దానిమ్మ రసాన్ని ముఖానికి పట్టించి అలా వదిలేయండి. ఇది అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తర్వాత సాధారణ నీటితో కడిగేసుకోండి.
వరిపిండిని తీసుకొని దానిమ్మ రసంలో వేసి పేస్ట్ లాగా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయండి. నలుగు పిండి పెట్టినట్టు ఈ మిశ్రమాన్ని ముఖానికి రుద్దితే చర్మంపై ఉన్న మృత కణాలన్నీ తొలగిపోతాయి. మురికి, దుమ్ము, ధూళి కూడా పోతుంది. చర్మం మెరవడం మొదలు పెడుతుంది.
Also Read: తియ్యటి పుచ్చకాయ కావాలా? సింపుల్ గా ఇలా గుర్తుపట్టండి!
దానిమ్మ రసం రాయడం వల్ల మొటిమలు రావడం తగ్గుతాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలను, మచ్చలను తగ్గించడానికి దానిమ్మ రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై సగం ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి చర్మంపై జిడ్డు పట్టడం తగ్గుతుంది. జిడ్డు చర్మంతో ఉన్నవారు ప్రతిరోజు దానిమ్మ రసాన్ని ముఖానికి పూసుకుంటే ఎంతో మంచిది. దానిమ్మ సహజమైనది. కాబట్టి ఇది పడకపోవడం అంటూ ఉండదు. చర్మంపై ఎరుపుదనం, చికాకు, మంట వంటివి ఉంటే వెంటనే దానిమ్మ రసం రాసుకోండి. ఇది చర్మాన్ని శాంత పరుస్తుంది. ఓదార్పును అందిస్తుంది.