BigTV English

Health Problems: ఏంటీ.. ప్రపంచంలో ఇంతమందికి ఆ సమస్య ఉందా? ఈ లక్షణాలు చూసి.. ఆ లిస్టులో మీరు ఉన్నారేమో చూసుకోండి

Health Problems: ఏంటీ.. ప్రపంచంలో ఇంతమందికి ఆ సమస్య ఉందా? ఈ లక్షణాలు చూసి.. ఆ లిస్టులో మీరు ఉన్నారేమో చూసుకోండి

డిప్రెషన్ అనేది చిన్న సమస్య కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. తమకు తెలియకుండానే ఆ వ్యాధి బారిన పడి అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. శారీరక సమస్యలు, గాయాలు బయటికి కనిపిస్తాయి. వాటిని వైద్యులు గుర్తించగలరు, కానీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ లోపే కొంతమంది డిప్రెషన్ వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకోలేక మరణిస్తున్నారు.


ఎన్ని కోట్ల మందికి డిప్రెషన్?
ది కాన్ఫరెన్స్ బోర్డ్ డేటా చెబుతున్న ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మంది ప్రజలు డిప్రెషన్ తో బాధపడుతున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారిలో 34 శాంతం మంది ఈ డిప్రెషన్ బారిన పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇంట్లో కార్యాలయంలో ఉన్న పని ఒత్తిడి వల్లే అధికంగా వారికి డిప్రెషన్ వస్తున్నట్లు కూడా అధ్యయనాలు వివరిస్తున్నాయి.

డిప్రెషన్ కు కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. ఇది ఒక వైద్య పరిస్థితి గానే చెబుతారు నిపుణులు. ఇది శారీరక సమస్యలతో పాటు భావోద్వేగ సమస్యలకు కారణం అవుతుంది. రోజువారీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. కాబట్టి డిప్రెషన్ లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా మానసిక వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు.


డిప్రెషన్ లక్షణాలు ఏమిటి?
డిప్రెషన్ బారిన పడినవారు శక్తి లేనట్టు వ్యవహరిస్తారు. తమలో తామే కుంగిపోతారు. ఎక్కువ సమయంపాటూ అలసిపోయినట్టు కనిపిస్తారు. ఎక్కువగా నిద్రపోవడం లేదా తక్కువగా నిద్రపోవడం వంటివి చేస్తారు. వారికి ఏ పని పైనా ఆసక్తి ఉండదు. బరువు విపరీతంగా పెరిగిపోతారు. లేదా తగ్గిపోతారు. ఏకాగ్రత వారిలో లోపిస్తుంది. ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడతారు. అలా కూర్చున్నప్పుడు కూడా విచారంగా ఉంటారు. వారిలో అప్పుడప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే తమకు ఆత్మ గౌరవం లేదని, ప్రజలు తమకు విలువ ఇవ్వడం లేదని భావిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడతారు. ఇంట్లో వారిపై అరుస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే మీలో ఇలాంటి లక్షణాలు వచ్చాయేమో తెలుసుకోండి. మీ అతి కోపానికి, అతి చిరాకుకు, పెరుగుతున్న బరువుకు, నిద్రలేమికి, నీరసానికి కారణం డిప్రెషన్ కూడా కావచ్చు.

డిప్రెషన్ బారిన పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. మెదడులోని రసాయన స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడినా కూడా మూడ్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. ఇవి డిప్రెషన్ కు దారితీస్తాయి. అలాగే జీవితంలో ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, ఏదైనా అసాధారణ సంఘటనలు జరగడం, ఉద్యోగం లేకపోవడం వంటివి కూడా డిప్రెషన్ కు దారితీస్తాయి. కొన్నిసార్లు కుటుంబ వారసత్వంగా కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

ధూమపానం, మద్యపానం వంటివి అతిగా అలవాటు పడటం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, డిప్రెషన్ కు కారణం కావచ్చు. కాబట్టి మీకు దేనికి డిప్రెషన్ వచ్చిందో గుర్తించేందుకు వైద్యుల సహాయం తీసుకోవాలి. సైకో థెరపీ, కాంబినేషన్ థెరపీలు ఎన్నో ఉన్నాయి. వీటి ద్వారా మీ మిమ్మల్ని డిప్రెషన్ బారిన నుంచి వైద్యులు కాపాడగలరు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×