BigTV English

Bigg Boss: మహిళా కమిషన్ నోటీసులు.. షాక్ లో బిగ్ బాస్..!

Bigg Boss: మహిళా కమిషన్ నోటీసులు.. షాక్ లో బిగ్ బాస్..!

Bigg Boss.. బిగ్ బ్రదర్ పేరిట విదేశాలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్కడ భారీగా పాపులారిటీ సొంతం చేసుకోవడంతో ఇండియన్ ఆడియన్స్ కూడా ఈ రియాల్టీ షో ను తెగ ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ షో కి తొలి అడుగు వేసింది హిందీ పరిశ్రమ. బిగ్ బాస్ పేరిట మొదటిసారి హిందీలో ప్రారంభమైంది. అక్కడ సక్సెస్ అవ్వడంతో అన్ని భాషలలో కూడా ఈ షోని ప్రారంభించడం మొదలుపెట్టారు. అలా తెలుగులో కూడా ఈ షో 2017లో మొదలైంది. ఇప్పటికే ఏడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ జరుపుకుంటోంది. ఇక ప్రస్తుతం ఎనిమిదవ సీజన్లో భాగంగా ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఆరవ వారం చివరికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లతో హౌస్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. మరొకవైపు కంటెస్టెంట్లలో కూడా పోటీని నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి మహిళా కమిషన్ నుంచి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


బిగ్ బాస్ కు మహిళా కమిషన్ నోటీసులు..

బిగ్ బాస్ ప్రస్తుతం అన్ని భాషలలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడలో ఏకంగా 11వ సీజన్ ప్రారంభమయ్యింది. అయితే ఈ 11వ సీజన్ లో స్వర్గ – నరక అనే ఒక కొత్త కాన్సెప్ట్ ను తీసుకురావడంతో ఈ కాన్సెప్ట్ కారణంగా మహిళా కమిషన్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే స్వర్గ – నరక అనే కాన్సెప్ట్ కి కాస్త బ్రేక్ పడింది. స్వర్గం – నరకం పేరుతో పోటీదారుల సామాజిక న్యాయాన్ని హరిస్తున్నారని మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారట. అంతేకాదు మహిళల గోప్యతకు ముప్పు వాటిల్లుతోందని సమాచారం. ముఖ్యంగా ఆహారం , మరుగుదొడ్ల విషయంలో నరకవాసుల దుర్వినియోగంపై కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా కమిషన్ బిగ్ బాస్ ప్రోగ్రాం నిర్వాహకులకు అలాగే కలర్స్ ఛానల్ కు నోటీసులు జారీ చేసింది.


దెబ్బకు దిగొచ్చిన బిగ్ బాస్..

దీని కారణంగా ఇప్పుడు స్వర్గం – నరకం కాన్సెప్ట్ నిలిచిపోయింది. నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు నివేదిక ఇవ్వాలని రాంనగర్ పోలీసులకు లేఖ ద్వారా సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు అన్నింటితో కూడా అప్రమత్తమైన బిగ్బాస్ నిర్వాహకులు వెంటనే స్వర్గ – నరక అనే కాన్సెప్ట్ కు స్వస్థి పలికారు. కంటెస్టెంట్స్ కి సమాచారం ఇవ్వకుండా ఉండడానికి స్వర్గం నరకం అనే విభజించిన వాటిని ఒకే ఇంట్లోకి చేర్చుతూ.. ఇంటి మధ్యలో ఉన్న ఇనుప కడ్డీని కాస్త విరిచేశారు. మొత్తానికైతే ఈ స్వర్గం – నరకం ఈసారి బిగ్ బాస్ హౌస్ లో హైలెట్ గా నిలిచింది. కొందరిని స్వర్గానికి, మరికొందరిని నరకానికి పంపారు. ఇప్పుడు నోటీసుకు భయపడి స్వర్గం నరకం అనే పదాన్ని కూడా తొలగించి అందరిని ఒకే ఇంట్లోకి చేర్చారు నిర్వహకులు.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×