శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. విజయవంతంగా అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టారు. అక్కడున్న వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుందో, వారు ఏం తింటారు అన్న సందేహాలు సాధారణ ప్రజల్లో ఉంటాయి. ఎక్కడైనా కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యేకమైన ఫుడ్స్ ను తీసుకోవాలి.
ఇదే ఆ సూపర్ ఫుడ్స్
వ్యోమగాముల కోసం ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని ముందుగానే ప్యాక్ చేసి రాకెట్ లోనే పంపిస్తారు. వ్యోమగాములు తినే రహస్యమైన సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా? నాచు. పచ్చగా ఉండే నాచును వారు అక్కడ ఇష్టంగా తింటారు. నాచులో ఒక రకమైన జాతి స్పిరులినా. దీని రుచి, వాసన చాలా ఘాటుగానే ఉంటుంది. దీని ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. మన శరీరానికి అవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి.
స్పిరులినా అనే పిలిచే నాచులో పోషకాలు అధికం. కాబట్టి వ్యమగాములు దీన్ని సూపర్ ఫుడ్ అనే పిలుచుకుంటారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం వారు ఆరోగ్యంగా ఉండడానికి, శరీరానికి కావలసిన పోషకాలు అందించడానికి స్పిరులినా ఉపయోగపడుతుంది. దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
నాచు ఎందుకు?
స్పిరులినా అనే నాచులో 60 నుండి 70 శాతం ప్రోటీన్ ఉంటుంది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు ప్రోటీన్ అత్యవసరం. తమను తాము శక్తివంతంగా ఉంచుకోవడానికి ప్రోటీన్ నిండిన ఆహారాన్ని అధికంగా తినాలి. విటమిన్ బి12, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని చెప్పుకున్నాము. ప్రోటీన్ తో పాటు ఈ పోషకాలన్నీ వ్యోమగాములకు సరైన పద్ధతిలో శరీరానికి అందుతాయి.
స్పిరులినా అని పిలిచే నాచులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి వ్యోమగాముల గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే దీనిలో ఫైబర్ కూడా ఎక్కువే. కాబట్టి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైన అంశం రోగనిరోధక శక్తి. అంతరిక్షంలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలంటే తినడం చాలా ముఖ్యం.
ఈ నాచును తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించవచ్చు. ఇందులో ఇనుము, ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. ఈ నాచు తిడనం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది కాబట్టి శరీరానికి త్వరగా అలసట రాదు.
అందుకే ప్రత్యేకంగా స్పిరిలినాను డబ్బాల్లో ప్యాక్ చేసి వ్యోమగాములతో పాటు పంపిస్తారు. ఇది కొన్ని నెలల పాటు చెడిపోదు. ఎక్కువ శాతం డబ్బాలోనే పంపిస్తారు. కాబట్టి వ్యోమగాములకు ఆకలేసినప్పుడు డబ్బాను తెరిచి తినేయడమే. దీన్ని తినడం కాస్త కష్టంగానే అనిపించవచ్చు. కానీ అంతరిక్షంలో ప్రాణాన్ని కాపాడుకోవాలంటే, శక్తివంతంగా పనిచేయాలంటే ఈ నాచును తినాల్సిందే.