Phone side effects: స్మార్ట్‌ఫోన్‌లు, రకరకాలుగా అందుబాటులోకి రావడంతో చాలా మంది పెద్దల నుంచి పిల్లల వరకు నిద్రకు దూరమవుతున్నారు. అర్ధరాత్రి అయినా టీవిలకు, ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. దీంతో నిద్రలేమి సమస్యలతో దూరమవుతున్నారు. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు.. కానీ ప్రస్తుతం చిన్నారులను కూడా నిద్రలేమి సమస్యలతో వెంటాడుతోంది. దీని పెద్దల్లో అనారోగ్య సమస్యలు దారితీస్తున్నట్లే ఇప్పుడు చిన్నారులపై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది.
అధిక రక్తపోటు ముప్పు
ముఖ్యంగా చిన్నారుల మానసిక స్థితిపై నిద్రలేమి సమస్య తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. చిన్నారులు రాత్రిళ్లు ఫోన్ చూడటం వల్ల అధిక రక్తపోటు ముప్పు పెరుగుతుందని అంటున్నారు. నిద్ర పట్టకపోవడం, పట్టినా మధ్యలో మెలకువ రావటాన్ని నిద్రలేమి సమస్యగా గురిస్తున్నారు. కంటి నిండా నిద్రపోయే పిల్లలతో పోలిస్తే ఈ నిద్రలేమితో సతమతమయ్యేవారికి, అలాగే నిర్ణీత గంటల కన్నా తక్కువసేపు నిద్రించే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఐదు రేట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగే రక్తపోటు పరిగితే గుండెజబ్బుల ముప్పు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఏకాగ్రత లోపం
చిన్నారుల్లో సరైన నిద్రలేకపోతే అదివారి చదువుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఫోన్ చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది, అలాగే చదువు మనసును పెట్టలేరు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్ర ఉంటేనూ మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చిన్నారుల్లో అయితే నిద్రలేమి సమస్యల జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. వీరికి ఏ విషయాన్ని అయిన తొందరగా మర్చిపోతారని తెలిపారు.
మానసిక ఆరోగ్య సమస్యలు
సరైన నిద్రలేకపోతే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో చిన్నారుల్లో చిన్న వాటికే కోపం తెచ్చుకోవడం, చిరాకుపడడం, అందరిపై అరవడం వంటి లక్షణాలు ఉంటాయి. నిద్రలేమి చిన్న పిల్లల మానసిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. కేవలం మానసిక ఆరోగ్యంపైనే కాకుండా నిద్రలేమి చిన్నారుల శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: చుండ్రుతో బాధపడుతున్నారా?.. ఆయుర్వేదిక్ హెయిర్ మాస్క్‌తో సమస్యకు పరిష్కారం
నివారణ చర్యలు
పిల్లలు ఫోన్ ఎక్కువగా చూడాడానికి వారి తల్లిదండ్రలు ఎక్కువ కారణం.. తల్లిదండ్రలు పిల్లల ముందు ఫొన్ ఎక్కువగా చూస్తే ఆ అలవాటు మీ పిల్లలకు కూడా అవుతుంది. మరికొందరు వారి పనులు కావాలని.. సంవత్సరం పిల్లలకు కూడా ఫోన్ అలవాటు చేసి వారిని పక్కన ఉంచి వీరు పనులు చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడుతుంది. ఒకప్పుడు చందమామను చూపిస్తు అన్నం తినిపించే వారు చిన్నారులకు, కానీ ప్రస్తుతకాలంలో పిల్లలకి ఫోన్ ఇచ్చి తినబెడుతున్నారు. వారు అన్నం తినకున్న ఫోన్ ఇస్తా తిను అని వారికి లేని అలవాటును వారి తల్లదండ్రులు నేర్పిస్తున్నారు. ఇంకొంత మంది పిల్లలు వారి చూట్టు ఉన్న పిల్లలు ఫోన్ చూస్తు ఉంటే వారిని చూసి అలవాటు చేసుకుంటున్నారు. అలాగే ఫోన్ ద్వారా పిల్లలకు సరదా, వినోదం లభిస్తుందని చూస్తుంటారు.. కానీ దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
♦ పిల్లలకు ఫోన్ ఇవ్వడం తగ్గించి వారికి బయటి వాతావరణాన్ని అలవాటు చేయ్యాలి.
♦ పిల్లల ముందు తల్లదండ్రులు ఫోన్ చూడటం తగ్గించాలి.
♦ పిల్లలు రాత్రి పడుకునే ముందు వారికి చిన్న చిన్న కథలు చెప్పి వారిని పడుకోబెట్టాలి.
♦ అలాగే తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే పిల్లలు ఫోన్ కు ఎక్కువగా అడిక్ట్ అవ్వరు.
♦ తల్లిదండ్రులు అందరు.. వారి పిల్లల ఆరోగ్యం కోసం, భవిష్యత్తు కోసం ఫోన్స్‌ను దూరం పెట్టాలి. వారి సరైన సమయానికి సరైన నిద్ర పోయేలా చూసుకోవాలి.