Groom Likes Bride Sister| మన సమాజంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే పెళ్లి నిశ్చయం జరిగాక ఏదైనా కారణాల వల్ల అవి ఆగిపోతే అది అమర్యాదగా భావిస్తారు. కానీ అంతకంటే ముఖ్యం వ్యక్తుల జీవితానికి సంబంధించిన అంశమని అందరూ గుర్తించాలి. అయితే సమాజంలో తమకు అవమానం జరిగినట్లు భావించి కొందరు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లికొడుకు వివాహం రద్దు చేసుకున్నాడని తెలిసి అవమానంగా భావించిన పెళ్లి కూతురు ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ రాష్రంలోని రీవా నగరానికి సమీపంలని ఒక గ్రామానికి చెందిన 27 ఏళ్ల రేవతి (పేరు మార్చబడినది) అనే ఒక యువతికి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 16 2025న నిశ్చితార్థం కూడా జరిగింది. వెంటనే పెళ్లి జరగాలని ఇరువైపులా పెద్దలు నిర్ణయించారు. అందుకే రెండు రోజుల తరువత అంటే ఏప్రిల్ 18న ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ఏప్రిల్ 17న వరుడు సంజయ్ (26, పేరు మార్చబడినది) ఆమెను వివాహం చేసుకోకూడదు అని మనసు మార్చుకున్నాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. వారంతా అతనికి ఎంత నచ్చజెప్పినా అతను వినలేదు. పైగా పెళ్లికూతురు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను రేవతిని వివాహం చేసుకోలేనని చెప్పేశాడు. అంతటితో ఆగలేదు. కావాలంటే రేవతి చెల్లెలు తనకు బాగా నచ్చిందని ఆమెను పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెట్టాడు.
ఇది విని రేవతి కుటుంబ సభ్యులంతా షాకయ్యారు. అప్పటికే పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేశారు. కల్యాణ మండపం బుకింగ్, వంట ఏర్పాట్లకు అన్నీ సిద్దం చేసేశారు. పైగా ఇప్పుడు బంధువులందరికీ ఏమని చెప్పాలి? అని బాధపడుతూ ఉన్నారు. అయితే అంతకంటే పెద్ద ప్రమాదమే వారి తలపై పడింది. తన పెళ్లి రద్దు అయిందని తెలిసి రేవతి తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యా యత్నం చేసింది. గది తలుపులు మూసుకొని ఆమె విషం మింగేసింది.
Also Read: పెళ్లిలో మోసం.. వధువుగా పెళికూతురు తల్లి.. వరుడికి బెదిరింపులు
దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కానీ ఆమె మళ్లీ ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తానని.. తనకు జీవితం మీద ఆసక్తి లేదని ఏడుస్తూ చెప్పింది. దీంతో రేవతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడు పెళ్లికి ఒకరోజు ముందు ఫోన్ చేసి వివాహం రద్దు చేసుకున్నాడని.. తమ పరువుకి భంగం కలిగిందని.. తన కూతురిని ఆత్మ హత్య చేసుకునేందుకు వరుడు సంజయ్ ప్రవర్తనే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అసలు విషయం వేరే..
పోలీసులు సంజయ్ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారణ చేయగా.. వారు మరో విషయం చెప్పారు. రేవతికి ఇంతకుముందే పెళ్లి జరిగిందని ఆ విషయం సంజయ్ తనకు తెలియదని చెప్పాడు. అందుకే పెళ్లి ఆగకుండా రేవతి చెల్లెలిని పెళ్లి చేసుకోవడానికి తాను సిద్దమేనని చెప్పాడు. అయితే రేవతి తండ్రి మాత్రం రేవతి మొదటి వివాహం విషయం ముందే చెప్పేశామని.. ఏ విషయం దాచలేదని.. అన్నీ తెలిశాకే వారు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నారు.