Dongana Koduku: మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర హంగామా మామూలుగా ఉండదు. దానికి తోడు ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మౌళి హీరోగా నటించడంతో ‘దొంగ నా కొడుకు’పై మొదటి నుంచీ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఇక ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. కానీ కట్ చేస్తే.. థియేటర్ల దగ్గర సీన్ మాత్రం అంచనాలకు పూర్తి రివర్స్‌లో కనిపిస్తోంది. బడా బ్యానర్ పేరు, ప్రమోషన్ల హడావుడి ఉన్నా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సందడి లేదనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఓవర్సీస్ కలెక్షన్లను చూసి సినిమా బ్లాక్‌బస్టర్ అయిపోయిందా అంటే లేదని చెప్పాలి.. ఎందుకంటే మన దగ్గర, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది.
లిటిల్ హార్ట్స్ తర్వాత మౌళి లాంటి క్రేజీ యంగ్ హీరో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకుంటే, థియేటర్లలో మాత్రం జనాలు నీరసంగానే కనిపిస్తున్నారు. ‘లిటిల్ హార్ట్స్’కు వచ్చినంత ఊపు ఈ సినిమాకు లేదనే టాక్ అప్పుడే సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది.షోల సంఖ్య బాగానే ఉన్నా థియేటర్లలో సీట్లు మాత్రం నిండటం లేదని సమాచారం.
అందుకే సాయంత్రం వరకు ఇండియాలో కేవలం రూ. 70 లక్షల దగ్గరే కలెక్షన్లు ఆగిపోయాయని ఇన్ సైడ్ టాక్. మౌళి క్రేజ్‌కు, మైత్రీ బ్యానర్ రేంజ్‌కు ఈ నంబర్లు ఏమాత్రం సరిపోవని చెప్పడం లో సందేహం లేదు.
మరోవైపు ట్రేడ్ వర్గాలు మాత్రం ఫస్ట్ డే మొత్తంగా రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నాయి. కానీ ఈ లెక్కలు నిజం కావాలంటే నైట్ షోలకు ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తాలి. లేదంటే మొదటి రోజు వేసుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యే అవకాశాలు పుష్కలం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్ ఓపెనింగ్స్ అయితే కనిపించడం లేదనే చెప్పాలి.
దీనికి తోడు బాక్సాఫీస్ దగ్గర పోటీ కూడా మామూలుగా లేదు. ఇదే రోజు రిలీజైన ‘ఇట్లు అర్జున’, ‘డార్క్ చాక్లెట్’, ‘మాయ లేడీ’ సినిమాలతో పాటు, ఇప్పటికే థియేటర్లలో ఆడుతున్న ‘రామాయణ’, ‘సీన్’ సినిమాలు కూడా కాసులని షేర్ చేసుకుంటున్నవే.
ఇలాంటి టైమ్‌లో థియేటర్లకు జనాన్ని రప్పించడం మౌళి సినిమాకు పెద్ద సవాల్‌గా మారిందని చెప్పాలి. అసలు ‘లిటిల్ హార్ట్స్’తో వచ్చిన క్రేజ్‌ను ఓపెనింగ్స్‌గా మార్చుకోవడంలో ఈ సినిమా సక్సెస్ కాలేదా అన్న డౌట్స్ వస్తున్నాయి కూడా.ఏది ఏమైనా ఈ వీకెండ్ గడిస్తే కాని సినిమా రిజల్ట్ పూర్తిగా తెలిసేలా లేదు !
ALSO READ :బాలయ్య మాస్ ధమాకా.. దద్దరిల్లిన దాదా సాంగ్!