Intinti Ramayanam Today Episode August 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ప్రణతి పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇక మనం ఈ పెళ్లిని భరత్ తో చేసేస్తే బాగుంటుందని రాజేంద్రప్రసాద్ పార్వతిని ఒప్పిస్తాడు. పార్వతి పంతులుగారు వాళ్ళిద్దరు పెళ్లిని జరిపించండి అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి, శ్రీయలు ఇద్దరు అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతారు. అక్షయ్ కూడా ఎంత చెప్పినా పార్వతీ వినడం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి ప్రణతి భరత్ల పెళ్లి సవ్యంగా సాగుతుంది..
నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరిపించాలని అనుకున్నాను.. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. నా కూతురు కోసం నేను ఎన్ని అనుకున్నాను ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని పార్వతి అనుకుంటుంది. ప్రణతి పెళ్లి జరిగినందుకు పార్వతీపై అక్షయ్ పల్లవి ఇద్దరు సీరియస్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతీపై పల్లవి సీరియస్ అవుతుంది. మీరు పెళ్లి చేశారు మళ్లీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని పల్లవి అంటుంది. అక్షయ్ కూడా భరత్ ని ఉద్యోగం లేదు అంటూ దారుణంగా అవమానిస్తాడు. వాళ్లు మాటలు విన్న ప్రణతి భరత్ ఇప్పుడు నా భర్త నా భర్తను అనే హక్కు మీకు లేదు అని అంటుంది. మన ఇంట్లో వంట మనిషి కూడా ఏదో ఒక జీతం ఏదో ఒక సొంత ఇల్లు అద్దె కొంప ఉంటుంది. వీడికి మాత్రం అవేవీ లేవు అని అక్షయ్ అంటాడు. నువ్వు కూడా వదినని చేసుకున్నావు కదా ఎందుకు ఇప్పుడు మమ్మల్ని ఇలా అంటున్నావు అమ్మ మమ్మల్ని అవమానించాలని ఇక్కడికి తీసుకొచ్చావా అని ప్రణతి అడుగుతుంది..
మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నేను నేనేమైనా అంటే మీరు బాధపడాలి నన్ను అడగాలి. వీళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి పదండి అని పార్వతి అంటుంది. అక్షయ్ మాత్రం వాళ్ల ముందర నా తలెత్తుకునేలాగా చేసావు అని తల్లి పై సీరియస్ అవుతాడు. శ్రియను హారతి తీసుకురమ్మని అడిగితే నేను తీసుకురాను అని అంటుంది. పల్లవి హారతి తీసుకురమ్మని పార్వతి అడిగితే మీరే పెళ్లి చేశారు కదా మీరే తీసుకోండి అని లోపలికి వెళ్ళిపోతుంది.. భానుమతి నేను వెళ్లి హారతి తీసుకొని వస్తాను పార్వతి అని అంటుంది.
శ్రీకర్ కమల్ మాత్రం మా చెల్లికి మేమే హారతి ఇస్తామని వెళ్లి హారతి తెచ్చి ఇస్తారు. ప్రణతి భరత్ ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. అవని వీళ్ళిద్దరూ లేరని ఇల్లంతా బోసిపోయిందని బాధపడుతూ ఉంటుంది. స్వరాజ్యం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అమ్మ మళ్లీ ఇక్కడికే వస్తారు కదా నువ్వేమీ బాధపడకు అని అంటుంది. అటు అవని ఏడాదిపాటు నాకు కొంగుపట్టుకుని తిరిగింది పిన్ని ఇప్పుడు నాకు వెలితిగా అనిపిస్తుంది అని అంటుంది.
అప్పుడే అక్షయ్ ఇంట్లోకి వస్తాడు. నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని అడుగుతాడు. అవని పూజ పేరుతో అబద్ధం చెప్పి మీ చెల్లిని అక్కడికి తీసుకెళ్ళారా అని అడుగుతుంది. మీ చెల్లిని మీరే మోసం చేసి ఇలా పెళ్లి చేయాలని చూస్తారని అవని అడుగుతుంది.. నీ తమ్ముడితో చేయడం ఇష్టం లేక నేను అబద్ధం చెప్పి తీసుకెళ్ళాను అని అవనితో అంటాడు అక్షయ్. కానీ నీ తమ్ముడికి ఏ సంపాదన లేదు కనీసం భార్యకి మూడు పూటలా అన్నం పెట్టే శక్తి కూడా తనకి లేదు అందుకే మా అమ్మ చూసినా ఫ్రాడ్ అయినా సరే వాడు భార్యను బాగా చూసుకుంటాడని చేయాలనుకున్నాను అని అక్షయ్ అంటాడు.
నీకు పెళ్లి ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పొచ్చు కదా ఎందుకు అబద్దం చెప్పావు అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. నాకు ఇష్టం లేదని చెప్తే మీరు వెంటనే పెళ్లి చేస్తారు అందుకే ఇష్టం ఉన్నట్లు చెప్పి ప్రణతి పెళ్లి చేయాలని అనుకున్నారని అక్షయ్ నిజం చెప్తాడు. మరి మీరు అబద్ధం చెప్పి ఇదంతా చేసింది ఫ్రాడ్ పని కాదా అని అవని అడుగుతుంది. భరత్ కు సంపాదన లేదు అంటున్నావు. మరి నువ్వు ఒక బిజినెస్ మాన్ గా చేసి ఇప్పుడు నీ చేతిలో కంపెనీ లేదు కనీసం చిల్లి గవ్వ కూడా లేదు కదా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.
ఇప్పుడు లేవు ఎవరు మోసం చేస్తే పోగొట్టుకున్నాను తప్ప నా అంతట నేను పోగొట్టుకోలేదు. నేను కచ్చితంగా సంపాదించి తీరుతాను అని అక్షయ్ అంటాడు. అటు అవని అక్షయ్ వెళ్లిపోతుంటే ఆపుతుంది. ఇక్కడే ఉంటే నన్ను కూడా మార్చేస్తావని నా భయం అందుకే నేను వెళ్ళిపోతున్నానని అంటాడు. ఏదో ఒక రోజు మీ మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తారు అని అవని అంటుంది. ఇక శ్రేయ ప్రణతి వచ్చింది కదా అవి కూడా వస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
Also Read : బాలుకు దారుణమైన అవమానం.. రెచ్చిపోయిన మనోజ్.. సంజూ రివేంజ్..
అటు పల్లవి కూడా ఇద్దరూ అవని వస్తే మన ఆటలు సాగవు అని అనుకుంటారు. ప్రణతి ఎలాగైనా ఇంట్లోంచి వెళ్లిపోయారా చేయాలని పల్లవి అనుకుంటుంది. ఆ తర్వాత కమల్ పల్లవి అసలు మోసానికి కనిపెట్టాలని అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..