Janu Lyri:ఫోక్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జాను లిరి (Janu lyri) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. కెరియర్ పరంగా జోషులో కొనసాగుతోంది. ఇకపోతే కెరియర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. డీ డాన్స్ షోలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్లో జరిగిన మార్పులను , అనుభవాలను బయట పెట్టడమే కాకుండా తాను నెలకు ఎంత సంపాదిస్తాను అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.
జాను లిరి మాట్లాడుతూ..” నేను ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు రూ.1000 నుంచి రూ.1500 వరకు మాత్రమే నాకు పారితోషకం లభించేది. చిన్న వేదికలపై మొదలైన నా ప్రయాణం క్రమంగా పెద్ద స్టేజీల వరకు చేరింది. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదు అని నా రెమ్యూనరేషన్ నిరూపిస్తుంది. ప్రస్తుతం నేను ఒక్కో పాటకు రూ.20వేల నుండి రూ.50 వేల వరకు పారితోషకం అందుకుంటున్నాను అంటూ తెలిపింది. ఇకపోతే ఇప్పటివరకు 2వేలకు పైగా ఫోక్ సాంగ్స్ కు ప్రదర్శనలు ఇచ్చిన ఈమె.. తెలంగాణ సాంప్రదాయ పాటలకు డాన్స్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. అలాగే వీడియోలు, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ మరింత ఆదాయం పొందుతోంది. ఇకపోతే ఏడాదికి సుమారుగా వచ్చే అవకాశాలను బట్టి రూ.6 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాను లిరి తో డ్యాన్స్ అంటే ఇష్టమా? నటన అంటే ఇష్టమా? అని అడగగా నాకు యాక్టింగ్ కూడా ఇష్టమే. తుపాకీ రాముడు చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు ట్రై చేశాను కానీ అవకాశం లభించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది జాను లిరి.
ALSO READ:“దివికి దివికి”.. వదినా మరదళ్లుగా దుమ్ములేపేసిన కీర్తి – కృతి!
జాను లిరి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. బెల్లంపల్లికి చెందిన టోనీ కిక్ అనే వ్యక్తిని ప్రేమించే వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు. పైగా ఆ బాబుకి లిరి అని నామకరణం కూడా చేశారు. అయితే ఇద్దరు కలిసి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చేవారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం జానూ కొడుకుతో ఒంటరిగా ఉంటూ తన కెరియర్ను కొనసాగిస్తోంది . మధ్యలో సింగర్ దిలీప్ దేవగన్ తో రెండవ వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి పెళ్లి చేసుకుందా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా జాను లిరికి సంబంధించిన ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది.