Nidhhi Agerwal: హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. అందం ఉన్న కూడా హిట్ సినిమాలు అయితే సరిగ్గా లేవు.. తెలుగులో మాత్రమే కాదు తమిళ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ అమ్మకు సరైన హిట్ సినిమా అయితే ఇప్పటివరకు పడలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజా సాబ్ మూవీ చేస్తుంది.. అయితే ఈ మధ్య ఈమె నెటిజెన్లతో ఎక్కువగా చిట్ చాట్ ఎక్కువ వస్తుంది. తాజాగా ఓ నెటిజన్ నిధికి దిమ్మతిరిగే షాకిచ్చాడు.. అసలు మ్యాటరేంటంటే..
నిధికి నెటిజన్ షాక్..
హీరోయిన్ నిధి అగర్వాల్ ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతుంది. తాజాగా ‘ఆస్క్ నిధి’ అంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఆమె నెటిజన్ల ప్రశ్నలకు నిదానంగా ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్తూ వచ్చింది. అయితే ఓ నెటిజన్ పాపకు దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. బంగారం, మీ అమ్మగారి నంబర్ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను, ప్లీజ్ ఇవ్వచ్చుగా? అంటూ కామెంట్ చేయగా, దానికి ఆమె, అవునా, నాటీ.. అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది.. వాస్తవానికి ఇలాంటి కామెంట్లకు స్పందించకుండా వదిలేయడం లేదా కాస్త ఘాటుగా సమాధానం ఇవ్వడం చేస్తుంటారు, కానీ నిధి అగర్వాల్ మాత్రం చాలా సరదాగా తీసుకుంటూ ఈ విషయంలో కామెంట్ చేసింది.. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న అన్‌కండిషనల్ లవ్ ఎలా ఉందని అడిగితే, తాను ఆ అన్‌కండిషనల్ లవ్‌ను ఫీల్ అవుతున్నానని, ఇలాంటి ప్రేమ దొరుకుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చింది..
Also Read :మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వకండి…
‘హరిహర వీరమల్లు’లో చెయ్యడం అదృష్టం..
నిధి అగర్వాల్ తెలుగులో పలు సినిమాలు చేసింది. అలాగే తమిళ్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆమెకు మంచి బ్రేక్ మాత్రం ఏ ఒక సినిమా ఇవ్వలేదని తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పైనే ఆశలు పెట్టుకుంది.. ఈ సినిమా గురించి ఎప్పుడు ఇంటర్వ్యూ కి వెళ్ళినా గొప్పగా చెబుతూ తన క్రియలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో ఫాన్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఈ సినిమా గురించి గొప్పగా చెప్తుంది.. సినిమాలో నటించడం తన అదృష్టమని పేర్కొన్న ఆమె, ప్రీ-రిలీజ్ స్పీచ్ గురించి తలుచుకుంటే ఇప్పుడే టెన్షన్ వస్తుందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారి ఎదురుగా కూర్చొని ఉంటాను, నేనేం మాట్లాడగలను, ఎలా మాట్లాడగలను? అప్పుడు నన్ను సపోర్ట్ చేయండి అని కామెంట్ చేసింది.. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని నిధి అగర్వాల్ చెప్పింది..