Nayanthara Documentary: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara). ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. తన నటనతో ప్రేక్షకులను అబ్బుపరుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ సౌత్, నార్త్ అని తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న తరుణంలో నయనతార పైన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) డాక్యుమెంటరీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ విషయంపై హీరో ధనుష్ (Dhanush) కారణంగా నయనతార కోర్టు వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ సమస్య సద్దుమణిగింది అనుకునే లోపే ఈ డాక్యుమెంటరీ మరోసారి చిక్కుల్లో పడిందని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మళ్లీ చిక్కుల్లో పడ్డ నయనతార డాక్యుమెంటరీ..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ నటి నయనతార డాక్యుమెంటరీలో స్థానం పొందిన ‘చంద్రముఖి’ సన్నివేశాలు తొలగించాలని దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఆ సందేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారు అని, కాపీరైట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే తమ అనుమతి లేకుండా సన్నివేశాలు ఉపయోగించారని, అందుకే రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చంద్రముఖి సినిమా కాపీరైట్ పొందిన ఏబి ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ చేసింది. దీనిపై డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్ స్టూడియో, నెట్ఫ్లిక్స్ రెండు వారాలలో జవాబు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ మళ్లీ వివాదంలో చిక్కుకోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి.
ధనుష్ మూవీ కారణంగా కోర్టుమెట్లెక్కిన నయనతార..
ఇదిలా ఉండగా నయనతార మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నయనతార తన డాక్యుమెంటరీలో రూపొందించడంతో ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల చేసినప్పుడు ధనుష్ మండిపడ్డారు. తన సినిమా సన్నివేశాలను తన అనుమతి లేకుండా తీసుకోవడంతో నయనతారపై ఆయన పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన నయనతార పర్మిషన్ కోసం ఎన్నోసార్లు ధనుష్ చుట్టూ తిరిగాను. ఆయన రెస్పాండ్ అవ్వలేదు అంటూ తెలిపింది. అయినా సరే తన సినిమాలోని సన్నివేశాలను తాను పర్మిషన్ ఇవ్వకుండానే ఉపయోగించడంపై కోర్టులో కేసు కూడా వేశారు ధనుష్. ఈ విషయంపై నయనతార – ధనుష్ మధ్య సోషల్ మీడియా వేదికగా వాగ్వాదం చోటు చేసుకోవడమే కాకుండా ఇప్పటికీ అభిమానుల మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది. ఇలా ఒక సమస్య తర్వాత మరొక సమస్య నయనతార డాక్యుమెంటరీనే కాదు ఇప్పుడు నయనతారను కూడా చిక్కుల్లో పడేసిందని చెప్పవచ్చు.
నయనతార సినిమాలు..
నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుందర్ సి(Sundar C) దర్శకత్వంలో ‘ మూకుత్తి అమ్మన్ 2’ సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వస్తున్న ‘మెగా 157’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. ప్రమోషన్స్ కి రాకుండా.. రెమ్యూనరేషన్ తగ్గించుకోకుండా కండీషన్లు పెట్టే నయనతార ఈ సినిమా కోసం సగానికి సగం తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే కాకుండా అప్పుడే ప్రమోషన్స్ లో కూడా పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
also read:M.M.Keeravani: ఇండస్ట్రీలో విషాదం.. కీరవాణి తండ్రి కన్నుమూత!