Illu Illalu Pillalu Today Episode july 8th: నిన్నటి ఎపిసోడ్ లో… నర్మదా సాగర్ ఇద్దరూ అర్ధరాత్రి దొంగగా లాంతరు తీసుకొని బయటకొస్తారు. అది చూసిన శ్రీవల్లి కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెనకాలే వస్తుంది. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటే సాగర్ కు చదువు చెప్పిందా? ఎందుకు ఇప్పుడు చదువుతున్నారు. వీరిద్దరి మేటర్ ఈరోజు ఇంట్లో వాళ్లకి కచ్చితంగా తెలిసేలా చేయాలని దొంగ దొంగ అని అరుస్తుంది. ఇంట్లోని వాళ్లంతా హాల్లోకి వస్తారు. ఆ తర్వాత తిరుపతి రామ రాజు మధ్య కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఏంటి దొంగనా ఎక్కడా అంటూ కర్రపట్టుకుని వస్తాడు రామరాజు. అయితే అందరు బయటకు వెళ్లేసరికి అక్కడ నర్మద, సాగర్‌లు బయట కనిపిస్తారు. సాగర్ చదువుతూ కనిపిస్తే.. నర్మద ఫోన్‌లో పాటు వింటూ ఉంటుంది. అలా రామరాజు కంట్లో పడేట్టు చేస్తుంది శ్రీవల్లి.. నర్మదా ఎగ్జామ్స్ నాకోసమే మావయ్య గారు ఆయన చేత చెప్పించుకుంటున్నాను అని చెప్తుంది. నర్మద సాధన ఇరికించాలనుకున్న శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. తిరిగి శ్రీవల్లికే దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తారు తోడికోడళ్ళు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు ఇంటికి భాగ్యం సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఏంటి చెల్లెమ్మ కబురు కూడా లేకుండానే సడన్ గా ఇచ్చారు అంటే ఏకాదశి కదండీ మీ ఇద్దరికీ బట్టలు పెడదామని వచ్చామండి అని అంటుంది. నర్మదా ప్రేమలను దారుణంగా అవమానించాలని భాగ్యం ఫిక్స్ అయ్యే ప్లాన్ ప్రకారం ఇంట్లోకి అడుగుపెడుతుంది.. నర్మదను పీటలు తీసుకురమ్మని చెప్పి దానిమీద దుమ్ము దులపాలని చెప్తుంది. మీ అమ్మ వాళ్లు మీకు ఇదే నా పద్ధతులు నేర్పించిందని ఇద్దరినీ నానా మాటలు అంటుంది. ప్రేమ పీటల మీద ఉన్న దుమ్మును దులిపి భాగ్యంకు దిమ్మదిరిగిపోయేలా చేస్తుంది. మీరిద్దరిని అవమానించాలని నేను ఇక్కడికి వచ్చాను అని భాగ్యం అనుకుంటుంది.
మీకు చెప్పడానికి చేయడానికి తల్లిదండ్రులు లేరు కదా మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా అని భాగ్యం నర్మదా ప్రేమలను అవమానిస్తుంది.. ఆ మాట వినగానే నర్మద ప్రేమ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ప్రేమ తన పుట్టింటి వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటుంది. ప్రేమ బాధను చూసి తట్టుకోలేక పోయిన ధీరజ్ మీ ఇంటి వాళ్ళని చూడాలనిపిస్తుందా..? వెళ్తావా అయితే మీ ఇంటికి అని అంటాడు. ప్రేమ ఎంత చెప్తున్నా కూడా వినకుండా ధీరజ్ ప్రేమను బయటకు తీసుకొస్తాడు..
మీ వాళ్ళకి దగ్గరగా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే మరి నువ్వు వెళ్ళు అక్కడే ఉండు అని ప్రేమ అంటాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా నేనెందుకు వెళ్లాలి పెళ్లయిన తర్వాత ఎలా వెళ్తాను అనుకున్నావు అని ధీరజ్ని ప్రేమ అరుస్తుంది. మరి ఇంకొకసారి ఇలా ఏడుస్తూ బాధపడుతూ కనిపించాలంటే కచ్చితంగా మీ ఇంట్లోకి తోసేసి వస్తానని ధీరజ్ అంటాడు.
భాగ్యం తన కూతురితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా నీ జోలికి రారు ఈరోజు చేసిన పనికి దెబ్బకి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు అని అంటుంది. అయితే చందు లోపలికి వచ్చి అత్తయ్య గారు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఆ పది లక్షలు మేటర్ కొంచెం త్వరగా తేల్చడాని అడుగుతాడు. ఇప్పుడు చూసిన మీరు ఆ ఊర్లో ఏ ఊర్లో ఉంటామంటారు ఫోన్ చేస్తే ఒకసారి కలవదు మీ అమ్మాయి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పి ఉంటది అని చందు అంటాడు.
అల్లుడుగారు అది మరీ పెద్ద మొత్తంలో డబ్బులు రావాల్సి ఉంది అవి రాగానే మీకు ఇచ్చేస్తాం ఒక వారం పది రోజులు పడుతుంది అని భాగ్యం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. అయితే ఇన్నిసార్లు కాల్ అత్తయ్య గారు మీరు నాకు రేపటిలోనే డబ్బులు ఇవ్వాలి.. లేకపోతే ఆ సేటు మా నాన్నకు వచ్చి చెప్తాడంట ఆ తర్వాత ఇంట్లో రచ్చ వేరేలా ఉంటుంది అని అంటాడు. ఆ మాట మాట్లాడుతుండగానే ఆనందరావు అక్కడికొచ్చి అల్లుడు గారు ఇదిగోండి చెక్కు అని ఇస్తాడు.
Also Read :అవనికి హారతి ఇచ్చిన పల్లవి..పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ ప్లానేంటి?
అటు భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా ఇవ్వద్దు ఇవ్వద్దు అని ఎంత చెప్పినా కూడా ఆనందరావు వినకుండా చెక్కులో సంతకం పెట్టి ఇస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఆనంద్ రావు పై శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ సీరియస్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. భాగ్యం వెళ్ళేది వెళ్లకుండా నర్మద దగ్గరికి వెళ్లి నా కూతుర్లకు ఏం జరిగినా నేను చూసుకుంటాను. నీకు ఎవరున్నారు చూసుకోవడానికి అని ఇంకా బాధపెడితే వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నర్మద కూడా నువ్వు అన్నదానికి ఇంకాస్త ఎక్కువ చేసి చూపిస్తానని భాగ్యంతో ఛాలెంజ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో నర్మదా శ్రీవల్లి పని పట్టే పనిలో ఉంటుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…