E-Paper
Advertisement

Kalki 2898 AD: ప్రభాస్‌తో ముదిరిన వివాదం… కల్కీ 2 నుంచి దీపికా పదుకొణె అవుట్

Kalki 2898 AD: ప్రభాస్‌తో ముదిరిన వివాదం… కల్కీ 2 నుంచి దీపికా పదుకొణె అవుట్
Advertisement

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలోవచ్చిన  చిత్రం కల్కి 2898 AD.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే దీపిక భారీ విజయాన్ని అందుకొని తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత దీపిక.. అల్లు అర్జున్ -అట్లీ సినిమాలో కూడా భాగమయ్యింది.

ఇక ఇదే కాకుండా  కల్కి సీక్వెల్ లో కూడా దీపికనే హీరోయిన్ గా నటిస్తుంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ కూడా అదే ఫిక్స్ అనుకున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా సమయంలో జరిగిన ఒక చిన్న వివాదం తరువాత కల్కి సీక్వెల్  నుంచి దీపికను తొలగించారని వార్తలు వినిపించాయి. స్పిరిట్ లో హీరోయిన్ గా మొదట దీపికానే అనుకున్నారు. కానీ, ఆమె చేసిన డిమాండ్స్ కు సందీప్ఒప్పుకోకపోవడంతో .. దీపికా తన పీఆర్ లతో కలిసి స్పిరిట్ కథను లీక్ చేసి రివెంజ్ తీర్చుకోవాలని ప్రయత్నించింది. దానికి వంగా.. గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో చిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి.. ప్రభాస్ సైతం దీపికా పై మండిపడే వరకు వచ్చిందట. ఇక డార్లింగ్ కూడా కల్కి సీక్వెల్ లో దీపికా లేకపోతేనే బెటర్ అని చెప్పడంతో మేకర్స్ అధికారికంగా దీపికాను కల్కి సీక్వెల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజాగా కల్కి సెకండ్ పార్ట్ లో దీపిక లేదని మేకర్స్ ఎక్స్ ద్వారా ప్రకటించారు.” దీపికా పదుకొనే కల్కి సీక్వెల్లో లేదు అని మేము అధికారికంగా తెలియజేస్తున్నాము. జాగ్రత్తగా అన్ని పరిశీలించిన తరువాతే మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మొదటి సినిమా పూర్తిచేసే సమయంలో మేము చాలా సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ తరువాత ఆ భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోతున్నాము. అంతేకాకుండా కల్కి 2898 ఏడి లాంటి సినిమాకు ఎంతో నిబద్ధత, అర్హత కావాల్సి ఉందని మేము అనుకుంటున్నాము” అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో దీపిక కల్కి సీక్వెల్ నుంచి అవుట్ అయిందని కన్ఫర్మ్ అయింది. అయితే దీపికను తొలగించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

స్పిరిట్ వివాదం వలనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారా.. ? ప్రభాస్ కూడా ఇందులో  ఇన్వాల్వ్ అయ్యాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. కానీ, ఏదిఏమైనా  ఈ వివాదం వలనే వైజయంతీ మూవీస్ దీపికాను తొలగించింది అంటే నమ్మేలా లేదు. ఇదేనా.. లేక ఇంకేదైనా కారణం ఉందా.. ? లేక సందీప్ కు పెట్టినట్లే నాగికి కూడా కండిషన్స్ పెట్టిందా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×