BigTV English

AA 26× A6: సినీ కార్మికుల సమ్మె.. రోజుకు కోట్లలో నష్టపోయిన బన్నీ నిర్మాతలు!

AA 26× A6: సినీ కార్మికుల సమ్మె.. రోజుకు కోట్లలో నష్టపోయిన బన్నీ నిర్మాతలు!

AA 26× A6: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప, పుష్ప2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా AA 26 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్నారు.


కోట్లలో నష్టాలు..

ఇక ఈ సినిమాలో ఎంతోమంది హీరోయిన్లు ఇతర స్టార్ నటీనటులు కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ అధినేత బన్ని వాసు (Bunny Vasu)కన్యాకుమారి సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఏదైనా చిన్న అప్డేట్ ఇవ్వబోతున్నారా అంటూ ప్రశ్న ఎదురయింది.


అల్లు అర్జున్ అట్లీ సినిమా పై సమ్మె ప్రభావం..

ఈ ప్రశ్నకు బన్నీ వాసు సమాధానం చెబుతూ ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు రావాలన్నా సన్ పిక్చర్స్ వారు మాత్రమే చెప్పాల్సి ఉంటుందని, మేము చెప్పడానికి వీలు లేదని ,మా చేతులు కట్టేశారు అంటూ సమాధానం చెప్పారు. అయితే ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్మికులు తమకు 31% వేతనాలు పెంచాలి అంటూ సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె గురించి కూడా మాట్లాడారు. ఈ సమ్మె కారణంగా ముంబైలో అల్లు అర్జున్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కోసం కొంతమంది టెక్నీషియన్లను ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిలిపించామని సినిమా షూటింగ్ బంద్ కావడంతో రోజుకు కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చిందని తెలియజేశారు.

వినాయక చవితి సందర్భంగా కన్యాకుమారి విడుదల..

ఇక ఇతర టెక్నీషియన్లకు, కార్మికులకు షూటింగ్ జరిగిన జరగకపోయినా వారికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనని అగ్రిమెంట్ కుదుర్చుకున్న నేపథ్యంలోనే అట్లీ బన్నీ సినిమాకు కోట్లలో నష్టాలు వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక కన్యాకుమారి సినిమా విషయానికి వస్తే..ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ “కన్యా కుమారి”(Kanya Kumari) .రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ ఈ సినిమాకు నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కార్యక్రమానికి బన్నీ వాసు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈయన అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు సమ్మె కారణంగా ఎదుర్కోన నష్టాల గురించి కూడా వెల్లడించారు.

Also Read: Actress Sridevi: నటి శ్రీదేవి పస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఏం చేశారో తెలుసా.. ఇలా కూడా చేస్తారా?

Related News

Sandeep Reddy Vanga: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. సందీప్‌రెడ్డి వంగా ఎమోషనల్

Sivakarthikeyan: మురగదాస్ తో సినిమా అంటే  హేళన చేశారు.. ఎమోషనల్ అయిన హీరో!

Ghaati Movie: అనుష్క ‘ఘాటి’ హక్కులు తీసుకున్న స్టార్‌ హీరో..

Actor Yash: డైరెక్టర్‌గా మారిన హీరో యష్.. ఇక థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

War 2 Losses : వార్ 2 మూవీకి 70 కోట్ల నష్టం… బిజినెస్ – కలెక్షన్స్ పూర్తి లెక్కలు

Kollam Thulasi: భార్య, కూతురు ఛీ కొట్టారు.. అనాథలా ఆశ్రమంలో ప్రముఖ నటుడు

Big Stories

×