Actress Sridevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి (Sridevi)అనే పేరు వినగానే అందరికీ అలనాటి తార అతిలోకసుందరి గుర్తుకు వస్తారు. అయితే శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijay Kumar)కూడా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమా(Eswar Movie) ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక కెరియర్ మంచి పోజిషన్లో ఉన్న సమయంలోనే శ్రీదేవి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్ ఛాన్సులు..
ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్ గానే అవకాశాలు అందుకోవటం విశేషం. ప్రస్తుతం నారా రోహిత్ (Nara Rohit)హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సుందరకాండ(Subdarakanda) సినిమా ద్వారా హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వ్యక్తిగత విషయాలు..
ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న శ్రీదేవి సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి తర్వాత పాప పుట్టడం వల్లే సినిమాలకు దూరమయ్యానని తెలిపారు. ప్రస్తుతం పాప నాలుగవ తరగతి చదువుతుందని ,పాపకు తన అవసరం పెద్దగా లేకపోవడంతోనే తిరిగి కెరియర్ పై ఫోకస్ చేశానని తెలిపారు. ఈ క్రమంలోనే ఈమెకు తన మొదటి రెమ్యూనరేషన్(First Remuneration) గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంత? ఆ రెమ్యూనరేషన్ తో ఏం చేశారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శ్రీదేవి ఆసక్తికరమైన సమాధానం వెల్లడించారు.
తిరుపతి హుండీలోకి రెమ్యూనరేషన్..
మొదటి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాన్ని మాత్రం తాను వెల్లడించను కానీ, ఆ రెమ్యూనరేషన్ మాత్రం తాను తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేశాను అంటూ ఈమె తెలియజేశారు.. ఫస్ట్ రెమ్యూనరేషన్ మొత్తం తిరుపతి హుండీలో వేశానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. మొదటి రెమ్యూనరేషన్ తో ఎవరైనా వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే వస్తువులను కొనుగోలు చేయడం లేదంటే వారి అమ్మానాన్నలకు ఇవ్వడం జరుగుతుంది. శ్రీదేవి మాత్రం తన రెమ్యూనరేషన్ మొత్తం వెంకటేశ్వర స్వామి హుండీలో వేశానని చెప్పడంతో ఇలా కూడా వేస్తారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుందరకాండ సినిమా విషయానికొస్తే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇటీవల భైరవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న రోహిత్ తిరిగి సుందరకాండ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: Jayammu Nischayammu raa: వామ్మో నాని ఇంతమందికి ప్రపోజ్ చేశాడా..అసలు విషయం చెప్పిన జగ్గు భాయ్!