Harshit Rana : ఆసియా కప్ 2025 కి ఇటీవలే టీమిండియా ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో కొంత మంది కీలక ఆటగాళ్లు అయిన శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ ని ఎంపిక చేయకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.వాస్తవానికి కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా 15 మంది జట్టు సభ్యుల్లో ఎంపికయ్యాడు. అయితే కీలక బౌలర్ సిరాజ్ ని ఎంపిక చేయకపోవడం పట్ల నెటిజన్లు సెలక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ గా హర్షిత్ రానా చేయాలని బీసీసీఐ భావిస్తోన్నట్టు సమాచారం.
Also Read : Vimal Pan Masala : టీమిండియా స్పాన్సర్ గా గుట్కా కంపెనీ.. ఆసియా కప్ కంటే ముందు కీలక పరిణామం!
హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ..?
గంభీర్ తన శిష్యుడి కోసం ఎంత పని చేశాడని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు. టీమిండియా కోచ్ గంభీర్ అంతా తనకు నచ్చినట్టు.. తాను మెచ్చిన వారిని ఎంపిక చేసి తన ఇష్టం వచ్చిన వారిని ఇష్టానుసారంగా ఎంపిక చేస్తున్నాడని కీలక ఆటగాళ్లను ఎంపిక చేయడంలో విఫలం చెందాడని గంభీర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు కొందరూ క్రికెట్ అభిమానులు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తరువాత జట్టులోని చాలా మంది మాజీ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టు ఎంపిక గురించి ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా టీమిండియా తరపున ఏకైక మ్యాచ్ ఆడిన యువ పేసర్ హర్షిత్ రాణా ఎంపిక గురించి మాజీ భారత క్రికెటర్ కె.శ్రీకాంత్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ హర్షిత్ రాణా ఈ జట్టులోకి ఎక్కడి నుంచి వచ్చాడు..? ఐపీఎల్ లో హర్షిత్ రాణా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అతడినీ ఎంపిక చేయడం ద్వారా మీరు ఇతర ఆటగాళ్లకు ఏ సందేశం ఇస్తున్నారు..? అని శ్రీకాంత్ అడిగారు.
అతనికి బదులు అతనే బెటర్..
హర్షిత్ రాణాకు బదులుగా వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండాలని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అసలు హర్షిత్ రాణా ఎక్కడి నుంచి వచ్చాడు..? అను ఐపీఎల్ లో చాలా పేలవంగా ప్రదర్శన ఇచ్చాడని.. అతని ఎకానమీ రేటు ఓవర్ కు 10 పరుగుల కంటే ఎక్కువ. అతన్ని జట్టులోకి ఎంపిక చేయడం ద్వారా ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ లకు ఏం సందేశం ఇస్తున్నారని బీసీసీఐ ప్రశ్న లేవనెత్తింది. ఎందుకంటే..? వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ తో పాటు 6వ స్థానంలో బౌలింగ్ లో కూడా సహాయం చేసేవాడు. కానీ అతన్ని విస్మరించి.. ఐపీఎల్ లో పెద్దగా బౌలింగ్ చేయని ఆరో బౌలర్ గా తిలక్ వర్మ, అభిషేక్ వర్మ లేదా శివం దూబేలను చూస్తున్నారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగల ఆటగాడిగా కోరుకుంటే వాషింగ్టన్ సుందర్ మంచి ఎంపిక అని అభిప్రాయపడ్డారు శ్రీకాంత్.
🚨VICE CAPTAIN HARSHIT RANA🚨
– BCCI is Considering Harshit Rana as the next ODI Vice Captain. [Abhishek Malhotra – EPSN sports] pic.twitter.com/wcGytHzWbB
— muffatball vikrant (@Vikrant_1589) August 23, 2025